Pat Cummins: అతడి ఆధ్వర్యంలో ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది. ఇంతకుముందు ఆ జట్టు చాలా సార్లు అలా వరల్డ్ ఛాంపియన్ అయినప్పటికీ.. ఆ సమయంలో వరల్డ్ కప్ విజేత కావడం మాత్రం ప్రత్యేకం. ఇదే ఊపులో ఆ జట్టు అతడి నాయకత్వంలో టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ గా అవతరించింది. మిగతా జట్లయితే ఆ కెప్టెన్ ను ఆకాశానికి ఎత్తేవి. పది కాలాలపాటు పత్రికలు పతాక శీర్షికల్లో వార్తలు రాసేవి. ఇక టీవీ చానల్స్ అయితే ప్రతి రోజుకో కథనంతో ఊదరగొట్టేవి. కానీ అతడి నాయకత్వ పటిమను, అతడి వీరోచిత ఆట తీరును ఆ జట్టు లైట్ తీసుకుంది. కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతేకాదు ఒక సాధారణ ఆటగాడిగా మార్చి.. చివరికి వాటర్ బాయ్ ని చేసేసింది.
ఆస్ట్రేలియా జట్టుకు వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలు అందించిన ఘనత ప్యాట్ కమిన్స్ దే. అయితే అతడికి టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో అతడు ఒమన్ జట్టుతో ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లో వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు. తన సహజర ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో.. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ సేనను ఓడించి కమిన్స్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీ అందుకుంది. అలాంటి ఈ ఆటగాడికి టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ చోటు కల్పించకపోవడం విశేషం.
వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ రెండిట్లోనూ భారత జట్టును ఓడించి.. ఆస్ట్రేలియాకు ట్రోఫీ దక్కేలా చేశాడు కమిన్స్. బ్యాట్, బంతితో అదరగొట్టే నైపుణ్యం కమిన్స్ సొంతం.. అతని ఆట తీరు గుర్తించే ఐపీఎల్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య 20.50 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.. అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన నేపథ్యంలో.. అతడు హైదరాబాద్ జట్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన హైదరాబాద్ జట్టును ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఓడిపోయినప్పటికీ.. కమిన్స్ నాయకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. హైదరాబాద్ ఆటగాళ్లలో దూకుడును పెంచి.. సరికొత్త ఆట తీరును ప్రదర్శించేలా చేయడంలో కమిన్స్ విజయవంతమయ్యాడు.. హైదరాబాద్ ఆడిన అన్ని మ్యాచ్లలోనూ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తిరుగులేని స్థాయిలో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు.
ఇక ప్రధాన బ్యాటర్లు విఫలమైన సందర్భాలలో.. తన వంతు పాత్ర పోషించాడు. చివరి వరకు మైదానంలో ఉండి జట్టు ఫైటింగ్ స్కోర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతటి ఆటగాడిని ఆస్ట్రేలియా జట్టు టి20 వరల్డ్ కప్ కోసం కెప్టెన్ గా నియమిస్తుందని అందరూ భావించారు. అయితే అతడు తుది జట్టులోనే చోటు కోల్పోవడం విశేషం.. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్ రెగ్యులర్ ప్లేయర్ గా ఉండేవాడు కాదు. అటు వన్డే, ఇటు టెస్ట్ మ్యాచ్ లలో నాయకత్వం వహిస్తూ ఉండేవాడు. పొట్టి ఫార్మాట్ వల్ల అదనపు భారం పడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనిని దూరం పెట్టింది.. దీనివల్ల కమిన్స్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఓ వచ్చింది.. గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ కమిన్స్ కనిపించడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏమాత్రం ఈగో లేకుండా జట్టు ఆటగాళ్ల కోసం డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తిన కమిన్స్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
WTC 2023 and Cricket World Cup 2023 winning skipper carried drinks for his teammates during the match against Oman in the T20 World Cup 2024.
– #PatCummins #T20WorldCup #T20WC2024 #CricketAustralia #AUSvOMAN #CricketTwitter pic.twitter.com/hlnFkdpHfD
— InsideSport (@InsideSportIND) June 6, 2024