SRH Vs KKR Final 2024: SRH కు కప్ అందించిన ఇద్దరూ ఆస్ట్రేలియన్సే.. ఇప్పుడు రేసులో కమిన్స్?

ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ ఫైనల్ దూసుకెళ్లింది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో హైదరాబాద్ రాజస్థాన్ చేతిలో విజయాన్ని సాధించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 12:08 pm

SRH Vs KKR Final 2024

Follow us on

SRH Vs KKR Final 2024: అది 2008.. ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం. హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అప్పుడు కెప్టెన్ గా గిల్ క్రిస్ట్ ఉన్నాడు.. కానీ మరుసటి సంవత్సరం ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అనితర సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.. సెమీఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడి, ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో సెమి ఫైనల్లో చెన్నై, బెంగళూరు పోటీపడ్డాయి.. ఈ మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ నగరంలోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గిల్ క్రిస్ట్ సారధ్యంలోని హైదరాబాద్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. ఆరు వికెట్లకు 143 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య సాధనకు దిగిన బెంగళూరు 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐపీఎల్ రెండవ సీజన్ లో కప్ దక్కించుకున్న జట్టుగా హైదరాబాద్ నిలిచింది.

ఇక తర్వాత 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది.. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు, గుజరాత్ జట్లు తలపడ్డాయి. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసి 158 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు.. 18.2 ఓవర్లలో, ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్, కోల్ కతా తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఎనిమిది వికెట్లకు 162 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన కోల్ కతా 8 వికెట్లకు 140 రన్స్ చేసింది. ఫలితంగా హైదరాబాద్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ సెమీఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టుతో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లకు 163 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు తో తలపడింది. అయితే ఈసారి కూడా 2009నాటి సీన్ రిపీట్ అయింది. వార్నర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన బెంగళూరు 7 వికెట్ల కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో వార్నర్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని.. రెండవసారి విజేతగా నిలిచింది. 2009లో, 2016లోనూ బెంగళూరు జట్టును ఓడించి, హైదరాబాద్ ఐపీఎల్ విజేతగా నిలవడం విశేషం.

ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ ఫైనల్ దూసుకెళ్లింది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో హైదరాబాద్ రాజస్థాన్ చేతిలో విజయాన్ని సాధించింది. శుక్రవారం రాత్రి చెన్నై వేదిక జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టును 36 పరుగుల తేడాతో హైదరాబాద్ మట్టి కరిపించింది. దర్జాగా ఫైనల్ దూసుకెళ్లింది. టైటిల్ కోసం కోల్ కతా జట్టుతో పోటీ పడనుంది. హైదరాబాద్ ఇప్పటివరకు రెండుసార్లు విజేతగా నిలిచినప్పుడు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా దేశానికి చెందిన కమిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా గత చరిత్రను హైదరాబాద్ జట్టు పునరావృతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు..కోల్ కతా ను ఓడించి.. కప్ దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.