https://oktelugu.com/

Malla Reddy: మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న రేవంత్..! అసలు కారణం అదేనంటా..!

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 25, 2024 / 11:46 AM IST

    Malla Reddy

    Follow us on

    Malla Reddy: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ స్థాయి అధికార దర్పణం ప్రదర్శించారో అందరికీ తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అండ..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గ్రేటర్ లో ఆయన తన హవా కొనసాగించారు. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మల్లారెడ్డి కందాన్ కు అడ్డు అదుపే లేకుండా పోయింది. మేడ్చల్-మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాలలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి విచ్చలవిడి కబ్జాలు చేశారనే ఆరోపణలున్నాయి. మల్లారెడ్డి ముందుగా తన అనుచరుల ద్వారా ఏదైనా చెరువు పక్కన ఒక ఎకరం లేదా రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత మెల్లిగా చెరువును కబ్జా పెట్టించే పనులకు పూనుకుంటారని విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే చెరువుల యొక్క శిఖం భూములు, ఎఫ్టిఎల్ ను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం,విద్యా సంస్థల నిర్వహణ వంటివి చేస్తాడనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ.

    ఇదే విషయమై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భూముల ఆక్రమణ కోసం అచ్చొచ్చిన ఆంబోతుల తిరుగుతున్నాడంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలోని మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి పై నోటితో చెప్పలేనంత ఘాటు పదజాలంతో విమర్శించారు. రేవంత్ రెడ్డిపై బూతు పురాణం అందుకున్నారు. అంతేగాక అరే గూట్లే దమ్ముంటే రా రేవంత్..అంటూ తొడ కొట్టి సవాల్ కూడా విసిరారు. ఈ వ్యవహారమే రేవంత్ రెడ్డిని అప్పట్లో బాగా హార్ట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మల్లారెడ్డి కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారు.

    మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కళాశాలల నిర్మాణాలపై సీఎం రేవంత్ పూర్తి ఎంక్వయిరీ చేయాలని అంతర్గతంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జాపెట్టి కళాశాలలు కట్టారనే ఆరోపణలపై అధికారులు ఆయన కాలేజీలలోని కొంత భాగాన్ని కూల్చేశారు. అంతేకాక సుచిత్రలోని సర్వేనెంబర్ 82లో మల్లారెడ్డి సుమారు రెండు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని దాని విషయంలో వెంటనే అవతల పార్టీకి చట్ట ప్రకారమే సపోర్ట్ చేయాలని సీఎంవో నుంచి కూడా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయనేచర్చ జరుగుతుంది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు కూడా నడుచుకున్నట్లు టాక్. ఇక దీంతో పాటు మల్లారెడ్డి బొమ్మరాస్ పేటలో ఓ చెరువు ఎఫ్టిఎల్ భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా ప్రభుత్వ యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలపైన ఆరోపణలు వచ్చాయి. కానీ,రేవంత్ రెడ్డి పెద్దగా వారి ఎవరి జోలికి వెళ్లడం లేదు. మల్లారెడ్డి గతంలో రేవంత్ ను పరుష పదజాలంతో దూషించడం.. తొడకొడుతూ..సవాల్ చేయడం వంటి చేష్టలతో నొచ్చుకొనే ప్రత్యేకంగా చామకూరపై సీఎమ్ఓ నజర్ పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. అందుకే మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో దూకుడుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు టాక్. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మల్లారెడ్డి ఎలా విధంగా డిఫెండ్ చేసుకుంటారనేది మాత్రం చూడాల్సిందే.