Teja Nidamanuru: విజయవాడ కుర్రాడు.. ఛాంపియన్లనే బెదరగొట్టాడు.. ఎవరీ తేజ నిడమానూరు..?

తాజాగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ కోసం జరుగుతున్న మ్యాచ్లోనూ అనిల్ తేజ అదరగొడుతున్నాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఏమాత్రం బెదరకుండా నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించిందంటే అనిల్ తేజ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా చెప్పవచ్చు.

Written By: BS, Updated On : June 27, 2023 12:17 pm

Teja Nidamanuru

Follow us on

Teja Nidamanuru: వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లో భాగంగా వెస్టిండీస్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగు తేజం అనిల్ తేజ నిడమానూరు చెలరేగిపోయాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో నెదర్లాండ్స్ జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించి పెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒంటి చేత్తో నెదర్లాండ్స్ జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేశాడు. ఈ నేపథ్యంలో అనిల్ తేజ నిడమానూరు పూర్తిస్థాయి వివరాలు మీకోసం.

అనిల్ తేజ నిడమానూరు 1994 ఆగస్టు 22న విజయవాడలో జన్మించారు. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న భారత సంతతికి చెందిన క్రికెటర్. అతను న్యూజిలాండ్ దేశ వాలే క్రికెట్లో ఆక్లాండ్ తరపున కూడా ఆడాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టు తరఫున ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల కిందట వర్క్ లో మేనేజ్మెంట్ కంపెనీకి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా పని చేశాడు. సహచర నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ స్టీఫెన్ మై బర్గ్ తో కలిసి పని చేశాడు. ఇక క్రికెట్ కెరియర్ విషయానికి వస్తే.. 2017 -18 లో సూపర్ స్మాష్ లో తన తొలి టి20 అరంగేట్రం చేసాడు. అలాగే 2018 19 లో ఫోర్డ్ ట్రోఫీలో ఆకలాంగుటట్టు తరఫున, ఆ తరువాత లిస్ట్ ఏ తరపున అరంగేట్రం చేశాడు. 2019లో నిడమానూరు నెదర్లాండ్స్ కు పూర్తిగా వెళ్లిపోయి కంపాంగ్ క్రికెట్ క్లబ్ లో ప్లేయర్, కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. తరువాత అతను పంజాబ్ రోటరీ డ్యామ్ కు మారాడు. 2021 లో డచ్ టి20 కప్ లో రోటర్ డామ్ తో జరిగిన ఒక గేమ్ లో 42 బంతుల్లోనే 14 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు.

కీలక ప్లేయర్ గా గుర్తింపు రావడంతో అవకాశం..

గత ఎడాది వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ కోసం డచ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. గతేడాది మే నెల ఆఖరులో జరిగిన వెస్టిండీస్ మ్యాచ్ లో వన్డే అరంగేట్రం చేశాడు. అలాగే గ తేడాది జింబ్యాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. అలాగే గత ఏడాది నిర్వహించిన ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ గ్లోబల్ క్వాలిఫైయర్ బి టోర్నమెంట్ కోసం నెదర్లాండ్స్ టి20 ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను పపువా న్యూ గినియా పై నెదర్లాండ్స్ జట్టు తరఫున గత ఏడాది జూలైలో టి20 అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ఈ ఏడాది మార్చిలో జింబాబ్వేత జరిగిన సిరీస్ కోసం డచ్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు. తొలి వన్డేలోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. 96 బంతుల్లోనే 110 పరుగులు చేయడంతో ఆతిధ్య జట్టు 249 పరుగులు చేధనలో నెదర్లాండ్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే ఈ దశలో అనిల్ తేజ అద్భుతమైన శతకాన్ని నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.

తాజా వెస్టిండీస్ మ్యాచ్ లోను అద్భుత ప్రదర్శన..

తాజాగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ కోసం జరుగుతున్న మ్యాచ్లోనూ అనిల్ తేజ అదరగొడుతున్నాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఏమాత్రం బెదరకుండా నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించిందంటే అనిల్ తేజ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ జట్టు తరుపున మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన అనిల్ తేజ 76 బంతులు ఆడి మూడు సిక్సులు, 11 మెరుపులాంటి ఫోర్లతో 111 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టులోని ఏ బౌలర్ ను వదలకుండా చుక్కలు చూపించాడు. తేజ బ్యాటింగ్ దాటికి విండీస్ బౌలర్లు చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం నెదర్లాండ్ జట్టు లో ఆల్ రౌండర్ గా స్థిరపడ్డాడు ఈ యంగ్ క్రికెటర్. ఇప్పటివరకు 16 వన్డే ఇంటర్నేషనల్, ఆరు టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో వెస్టిండీస్ పై తాజాగా చేసిన సెంచరీ రెండోది కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్సే వెస్టిండీస్ పై నెదర్లాండ్స్ జట్టు విజయానికి కారణమైంది.