Homeక్రీడలుYashasvi Jaiswal: సొంతింటి కలను నెరవేర్చుకున్న జైస్వాల్.. ఐపీఎల్ వల్లే సాధ్యమైందంటూ ఎమోషనల్..!

Yashasvi Jaiswal: సొంతింటి కలను నెరవేర్చుకున్న జైస్వాల్.. ఐపీఎల్ వల్లే సాధ్యమైందంటూ ఎమోషనల్..!

Yashasvi Jaiswal: భారత క్రికెట్ లో అనామకులుగా ఉన్న ఎంతోమందిని రాత్రికి రాత్రి స్టార్లను చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత క్రికెటర్లకు ఆర్థిక కష్టాలు తప్పాయనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్ క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది. ఒకప్పుడు బ్రతకడమే కష్టమైన ఎంతోమందిని లగ్జరీ లైఫ్ అనుభవించేలా చేసింది. అదే కోవలోకి వస్తారు ఎంతోమంది యువ క్రికెటర్లు. ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ కూడా ఐపీఎల్ తో తన ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి అంటూ చెప్పుకొస్తున్నాడు.

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అదరగొట్టాడు యశస్వి జైస్వాల్. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు గొప్ప విజయాలను అందించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన జైస్వాల్ ఐపిఎల్ తో అనేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించాడని చెబుతున్నాడు. ఒకప్పుడు అనేక విషయాలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలిచాయని జైస్వాల్ పేర్కొంటున్నాడు. ఐపీఎల్ లోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తగ్గడంతో పాటు ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు ఈ యంగ్ ప్లేయర్.

ముంబై నగరంలో అతిపెద్ద ఇల్లు కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్..

ముంబై నగరంలో ఇల్లు కొనుగోలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. కోట్లాది రూపాయలు వ్యయం అవుతుంది. అయితే ఇండియన్ యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మాత్రం ముంబై నగరంలో ఒక పెద్ద ఇల్లు కొనుగోలు చేశాడు. ఇది ఐపీఎల్ వల్లే సాధ్యమైంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో ఆడటానికి ముందు వరకు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఈ క్రికెటర్. పేదరికం ఉండడం వల్ల తండ్రికి సాయంగా పానీ పూరి కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఐపిఎల్ వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి సొంతింటి కలను నిజం చేసుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ ద్వారా తొలిసారి తానేంటో నిరూపించుకున్నాడు ఈ ముంబై బ్యాటర్. ఆటో నీలో పరుగులు వరద పారించి ఐపీఎల్ జట్ల యాజమాన్యాల దృష్టిలో పడ్డాడు. 2020లో రాజస్థాన్ రాయల్స్ యశస్విని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బాగా ఆడడంతో ఈ యంగ్ ప్లేయర్ ను 2022లో రాజస్థాన్ యాజమాన్యం నాలుగు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ లో జైస్వాల్ ఎలా ఆడాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సెంచరీ సహా 5 అర్థ సెంచరీలతో 600కు పైగా పరుగులు చేశాడు.

వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక..

ఐపీఎల్ లో అదరగొట్టిన జైస్వాల్ ను వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు ఎంపిక చేశారు. దీంతో భారత జట్టుకు ఆడాలన్న యశస్వి చిరకాల వాంఛ నెరవేరబోతోంది. దీని గురించి మాట్లాడుతూ జైస్వాల్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశం దక్కినప్పుడు ముంబైలో ఎలాగైనా మంచి ఇల్లు కొనాలని భావించానని, సొంతిల్లు లేక నా ఫ్యామిలీ ముంబైలో చాలా చోట్ల గడిపామని యశస్వి పేర్కొన్నాడు. మంచి ఇల్లు కొనుగోలు చేసి అందులో మా అమ్మానాన్న తోబుట్టువులతో హాయిగా జీవించాలని అనుకున్నారని, ఐపీఎల్ తో ఆ కళ నెరవేరింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు జైస్వాల్.

Exit mobile version