Odi World Cup 2023: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక: మ్యాచ్ ముగిశాక పగతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోని ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే..?

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఇక దాంట్లో భాగంగానే 280 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ మాత్రం చాలా దూకుడు గా ఆడుతూ 41 వ ఓవర్లో 282 పరుగులు చేసి మ్యాచ్ మొత్తాన్ని ముగించింది.

Written By: Gopi, Updated On : November 7, 2023 11:34 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకున్న క్రమంలో ప్రతి టీం కూడా సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం సజీవంగా ఉంచుకోవడంతో ప్రతి మ్యాచ్ గెలవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తు మంచి విజయాలను అందుకుంటున్నాయి…ఇక ఈ క్రమంలో నిన్న శ్రీలంక,బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడం జరిగింది.ఇక దీంతో ఈ రెండు టీమ్ లు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక ఇలాంటి క్రమంలో నిన్నటి మ్యాచ్ లో మాథ్యూస్ విషయంలో జరిగిన సంఘటనలో చాలా మంది చాలా రకాలు గా స్పందించారు. ఇక ఎవరు ఏం అనుకున్న కూడా షకిబుల్ హాసన్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు ఇక దాంతో మాథ్యూస్ ఔట్ అయి పోయాడు.

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఇక దాంట్లో భాగంగానే 280 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ మాత్రం చాలా దూకుడు గా ఆడుతూ 41 వ ఓవర్లో 282 పరుగులు చేసి మ్యాచ్ మొత్తాన్ని ముగించింది…ఇక ఈ మ్యాచ్ లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కింద అవుట్ అయి పోవడం తో అప్పుడు మాథ్యూస్ బాంగ్లాదేశ్ కెప్టెన్ అయిన షకిబుల్ హాసన్ ని కొద్దిసేపు బతిమిలాడు కున్నాడు అయిన కూడా ఆయన వినకుండా మాథ్యూస్ ని ఔట్ చేయించాడు.

ఇక దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షకిబుల్ హాసన్ బ్యాటింగ్ చేస్తున్న టైం లో మాథ్యూస్ బౌలింగ్ కి వచ్చి షకిబుల్ హాసన్ ని ఔట్ చేశాడు దాంతో మాథ్యూస్ చేతికి ఉన్న వాచ్ ను చూసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు దాని అర్థం ప్రతి ఒక్కడికి టైం వస్తుంది నన్ను అలా ఔట్ చేశావు నేను నిన్ను ఇలా ఔట్ చేశాను అని అన్నట్టు గా అర్థం వచ్చేలా తన చేతిలో ఉన్న వాచ్ ని చూపిస్తూ షాకిబుల్ హాసన్ కి మంచి గుణపాఠం చెప్పాడు అంటూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు…

ఇక ఇలాంటి క్రమం లో ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల మధ్య ఎంత కోపాలు ఉన్నాయో…ఇక ఇదంత చూసిన క్రికెట్ అభిమానులు సైతం మ్యాచ్ లు ఆడినప్పుడు కోపాలు ఎందుకు జస్ట్ గేమ్ ని గేమ్ లాగా ఆడితే సరిపోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు…