https://oktelugu.com/

Alia Bhatt: అలియా భట్ పెళ్లి చీర కట్టుకొని నేషనల్ అవార్డు తీసుకోవడానికి కారణం?

అవార్డు ఫంక్షన్ లో అమ్మడు పెళ్లి చీర ధరించడానికి కారణం ఏంటి అనేది మొత్తం మీద తెలిసిందోచ్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అలియానే ఈ విషయం గురించి ప్రస్తావించింది. తాను అవార్డు తీసుకునేటప్పుడు పెళ్లి చీరలో వెళ్లిందని.. గొప్ప ఈవెంట్ లో ప్రత్యేకమైన చీర కట్టుకోవాలి అనుకుందట.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 7, 2023 / 11:40 AM IST

    Alia Bhatt

    Follow us on

    Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు మంచి హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా నేషనల్ అవార్డు అందుకుంది. అయితే ఈ ఫంక్షన్ లో అమ్మడు పెళ్లి చీర ధరించి మెరిసింది. అయినా ఈ వేడుకలో అలియా భట్ ఎందుకు పెళ్లి చీర ధరించింది అనే ప్రశ్న అందరికీ వచ్చిందట. దానికోసం తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి కారణం మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసం..

    అవార్డు ఫంక్షన్ లో అమ్మడు పెళ్లి చీర ధరించడానికి కారణం ఏంటి అనేది మొత్తం మీద తెలిసిందోచ్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అలియానే ఈ విషయం గురించి ప్రస్తావించింది. తాను అవార్డు తీసుకునేటప్పుడు పెళ్లి చీరలో వెళ్లిందని.. గొప్ప ఈవెంట్ లో ప్రత్యేకమైన చీర కట్టుకోవాలి అనుకుందట. అయితే కొంత మంది గొప్ప ఈవెంట్లలో స్పెషల్ గా కనిపించాలి అనుకుంటారు. కానీ తనకు మాత్రం పెళ్లి చీర ముందుగా గుర్తుకు వచ్చిందట. ఆ చీర కట్టుకోగానే మరో చీర, ఇతర డ్రెస్ లు గుర్తుకు రాలేదట.

    ఏదో తెలియని ఆనందం కలిగిందని.. దానిపై నగలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించిందట. అయితే వేసుకునే డ్రెస్ కంటే వేసుకునే మనుషులే ముఖ్యం అని తెలిపింది అలియా. ఇక ఈ మధ్య అమ్మడు పై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ.. తన పెళ్లి విషయంలో ఎన్నో ట్రోలింగ్ లను ఎదుర్కొన్నాను అని.. అప్పుడు అన్నింటి గురించి ఆలోచిస్తూ చాలా బాధ పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడిప్పుడే వీటి నుంచి బయటపడుతున్నాను.. ఇప్పటి నుంచి వాటిని పట్టించుకోవద్దని ఫిక్స్ అయ్యాను అని తెలిపింది. ఒకసారి ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు వాటి గురించి ఆలోచించవద్దు అనుకుందట. మొత్తం మీద మంచి నిర్ణయం తీసుకున్న అలియా ఈవెంట్ లో పెళ్లి చీర కట్టుకోవడానికి కారణం చెప్పి అందరిని సంతోష పెట్టింది.