https://oktelugu.com/

Karthika Deepam Child Artist: హీరోయిన్ లా మారిపోయిన వంటలక్క కూతురు.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..

కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు, దీప దంపతులకు కవలలు జన్మిస్తారు. వీరిలో చిన్న అమ్మాయి హిమ. ఈమెు కార్తీక్ దగ్గరే పెరుగుతుంది. ముందుగా ఈమె తన బిడ్డ అని తెలియదు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 7, 2023 / 11:26 AM IST

    Karthika Deepam Child Artist

    Follow us on

    Karthika Deepam Child Artist: సినిమాలో కంటే టీవీ సీరియళ్లు ఈ మధ్య పాపులర్ అవుతున్నాయి. కొందరు సినిమా చూసేవాళ్లు సైతం ఇప్పుడు టీవీ సీరియళ్లకు అడిక్ట్ అవుతున్నారు. మొన్నటి వరకు టీవీలో పాపులర్ అయిన సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఉండలేని మహిళలు ఎంతో మంతి ఉన్నారు. ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే సీరియల్ లా చూపించడంతో దీనికి ఫ్యాన్స్ వీపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇందులో నటించిన వారు పాపుల్ అయ్యారు. ఈ సీరియల్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు దీప అలియాస్ వంటలక్క, డాక్టర్ బాబు. ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్టులుగా హిమ పాత్రలో ఓ అమ్మాయి నటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పెరిగి హీరోయిన్ లా మారింది. ఇప్పుడెలా ఉందంటే?

    కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు, దీప దంపతులకు కవలలు జన్మిస్తారు. వీరిలో చిన్న అమ్మాయి హిమ. ఈమెు కార్తీక్ దగ్గరే పెరుగుతుంది. ముందుగా ఈమె తన బిడ్డ అని తెలియదు. అయినా ఏంత గారాబంగా పెంచుతాడు. ఆ తరువాత హిమను దీప తీసుకెళ్తుంది. సీరియల్ లో ముందుగా అమ్మకు దూరంగా.. ఆ తరువాత నాన్నకు దూరంగా పెరుగుతుంది. చివరికి అమ్మానాన్నలు కలిశాక ఇద్దరు ఎంతో సంతోషిస్తారు. మొత్తగాన 1500కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుని పూర్తి అయినా.. ఈ సీరియల్ గురించి ఎవరూ మరిచిపోరు.

    అయితే ఇందులో నటించిన హిమ ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో మారింది. హిమ అసలు పేరు బేబీ సహృద. అమె సీరియల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఎన్నో విషాదాలను చూశారు. ఓసారి తన పర్సనల్ విషయాలను చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తను పుట్టినప్పుడు వాళ్ల నాన్న చూడడానికి రాలేదని చెప్పింది. దీంతో యాంకర్ రవి మాట్లాడుతూ ఆడపిల్ల అంటే భయం కాదు.. పది మంది మగవాళ్లతో సమానం అని ఓదర్చారు.

    కార్తీక దీపం సీరియల్ పూర్తయిన తరువాత బేబీ సహృద చదువుపై దృష్టి పెట్టింది. అయితే సీరియళ్లలో ఎక్కువగా నటించకపోయినా ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల ఆమె అందమైన ఫొటోలను అప్లోడ్ చేసింది. ఇందులో హిమ హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తోంది. అయితే సహృద వెండితెరపై హీరోయిన్ గా అలరిస్తుందా? లేక సీరియళ్లలో నటిస్తుందా? అనేది చూడాలి.