Pickup Ball: అమెరికా లో రీసెంట్ టైం లో బాగా ప్రాచుర్యం చెందిన ఆట పికెల్ బాల్, ఇప్పుడు ఇది ఇండియా లో కూడా పరిచయం కాబోతుంది. ఇది ఒక సరదా ఆట, ఈ ఆట లో టెన్నిస్, బాడ్మింటన్ మరియు పింగ్ పాంగ్ ఆటలు కూడా కలిసి ఉంటాయి.ఈ ఆట ని మనం ఇన్డోర్ గేమ్ గా పరిగణించొచ్చు, అలాగే అవుట్ డోర్ గేమ్ గా కూడా పరిగణించొచ్చు. ఎలాంటి ప్రాంతం అయినా సరే ఒక క్లోజ్ కోర్ట్ లాగ మనం మైదానం ని తయారు చేసి, సరికొత్త టెన్నిస్ నెట్ ని ఏర్పాటు చెయ్యాలి.
ఈ ఆటని ఒకరు , ఇద్దరు లేదా ముగ్గురు ఇలా ఎంతమంది అయినా కలిసి ఆడొచ్చు.ఈ ఆటని చిన్న పిల్లల దగ్గర నుండి, ముసలి వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఆడొచ్చు.ఈ ఆటని మొట్టమొదటిసారి అమెరికాలోని వాషింగ్టన్ ప్రాంతం లో 1965 వ సంవత్సరం లో కనుగొన్నారు.
వాషింగ్ టన్ సిటీ లోని బైన్ బ్రిడ్జి ఐలాండ్ లో ముగ్గురు వ్యక్తులు తమ పిల్లలకు బోర్ కొడుతున్న సమయం లో వాళ్లకి టైం పాస్ అయ్యేందుకు ఈ ఆటని కనుక్కున్నారు.ఇప్పుడు ఈ ఆట అమెరికా లో బాగా పాపులర్ అయ్యింది.క్రీడల మీద ప్రత్యేక ఆసక్తి ఉన్న మన ఇండియన్స్ కి ఈ ఆట బాగా నచ్చింది.
ఈ ఆటకి సంబంధించి 2008 వ సంవత్సరం లో ఇండియా లో ఆల్ ఇండియా పికెల్ బాల్ అసోసియేషన్ ని స్థాపించారు.కానీ అప్పట్లో ఈ ఆటని పెద్దగా పట్టించుకోలేదు, నేడు ఈ ఆట సోషల్ మీడియా కారణంగా బాగా ప్రాచుర్యం చెందింది, మన ఇండియన్స్ లో క్రీడల మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పికెల్ బాల్ గేమ్ ని బాగా ఇష్టపడుతున్నారు.అందుకే రాబొయ్యే రోజుల్లో ఈ గేమ్ మన ఇండియా లో ఒక విప్లవం లా వ్యాప్తి చెందబోతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.