Stop Clock Rule
Stop Clock Rule: క్రికెట్‌పై ప్రేక్షకుల అభిరుచిని పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త నిబంధనలు తెస్తోంది. కొన్ని నిబంధనలను సడలిస్తోంది. తాజాగా క్రికెట్‌లో మరో కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇకపై వన్డేలు, టీ20 క్రికెట్‌లో స్టాప్ క్లాక్ రూల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం(మార్చి 15న) ఒక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. జూన్‌లో నిర్వహించే టీ20 వరల్డ్ కప్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈమేరకు బోర్డు వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిబంధన అమలుతో మ్యాచ్ నిర్వహణలో 20 నిమిషాలు ఆదా అవుతుందని ఐసీసీ తెలిపింది.
స్టాప్ క్లాక్ రూల్ ఏంటి?
ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ చేసే జట్టు తన తర్వాతి ఓవర్‌లోని మొదటి బంధిని, మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపే ప్రారంభించాలి. అలా చేయకపోతే రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా స్లో ఓవర్ వేస్తే బౌలింగ్ చేసే జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.
కొన్ని సడలింపులు..
ఇక నిబంధన అమలులో కొన్ని సడలింపులు కూడా ఉంటాయి. ఓవర్ మధ్యలో బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినా.. గాయం కారణంగా మైదానాన్ని వీడినా కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చే వరకు క్లాక్‌లో ప్రారంభమైనదానిని రద్దు చేయవచ్చు. అలాగే పరిస్థితులు అనుకూలించని సమయాల్లో ఈ వెసులు బాటు ఉంటుంది.
రిజర్వ్ డేకు ఓకే
ఇక స్టాప్ క్లాట్ రూల్‌తోపాటు మరో నిబంధనను కూడా ఐసీసీ అమలు చేయనుంది. జూన్ 27న జరిVó టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, జూన్ 29న జరిగే ఫైనల మ్యాచ్‌లకు రిజర్వే డే ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా లీగ్ లేదా సూపర్ 8 దశలో లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే ఆట పూర్తయినట్లు పరిగణిస్తారు. నాకౌట్ మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్సల కోసం 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇండియా, శ్రీలంకలో 2026 టీ20 వరల్డ్ కప్..
ఇక తాజా బోర్డు సమావేశంలో టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయని తెలిపింది. ఇందులో 12 జట్లు ఆటోమేటిక్‌గా క్వాలిఫైయర్లుగా పరిగణిస్తారు. ఇందులో టీ20 2024 జట్లు 8 కాగా, మరో నాలుగు ఐసీసీ పాయింట్ల ఆధారంగా ఎంపిక అవుతాయి. మిగిలిన 8 టీంలను ఐసీసీ రీజినల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా ఎంపిక చేస్తుంది.