Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్టు లేకుండా ఒక్కడే ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఇక్కడే బతకాలి అని డిసైడ్ అయిపోయి ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆయన ప్రస్థానం ఉన్నత స్థానం లో ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికే ఆయన యంగ్ స్టర్స్ తో పోటీపడి మరి సినిమాలు చేస్తూ తనకు ఎవరు పోటీ లేరు, పోటీ రారు అనేంతలా సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చేసి చూపిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఒకప్పుడు చదువుకున్న పదోవ తరగతి నాటి సర్టిఫికెట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో చిరంజీవి పేరు కె ఎస్ ఎస్ వరప్రసాద్ రావు గా ఉంది. ఇక వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు.. ఆయన పుట్టిన తేదీ 22-08-1955వ సంవత్సరం గా ఉంది. ఇక చిరంజీవి పెనుగొండ లో జన్మించినట్టుగా ఆ సర్టిఫికేట్ లో ఉండటం విశేషం. ఇక ఇవన్నీ డీటెయిల్స్ తో ఒక సర్టిఫికెట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక ఇది చూసిన మెగాస్టార్ అభిమానులు చాలా సంతోషానికి లోనవుతున్నారు. అంటే ఒకప్పుడు శివశంకర వరప్రసాద్ గా ఉండి ప్రస్తుతం చిరంజీవిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది అప్పటి పేరును చూసినప్పుడు ఆయన అప్పటికి ఇప్పటికీ ఎంతలా అభివృద్ధి చెందాడు అనేదానికి ప్రతీకగా దీన్ని చూపిస్తూ వాళ్ళు చాలా ఆనంద పడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా కోసం 70 సంవత్సరాల వయసులో కూడా జిమ్ కి వెళ్లి కష్టపడుతున్నాడు అంటే చిరంజీవి డెడికేషన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…