India Vs South Africa: ఇండియన్ టీమ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉంది.అందుకే ఆస్ట్రేలియా మీద ఆడిన టి 20 సీరీస్ ని 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఈ సీరీస్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా టూర్ కి ఇండియన్ టీమ్ సిద్దం అయింది. ఇక అందులో భాగంగానే టి 20,వన్డే,టెస్ట్ సీరీస్ లకి సర్వం సిద్దం చేసారు. ఇక డిసెంబర్ 10 వ తేదీ నుంచి టి 20 సీరీస్ ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం మూడు మ్యాచులు ఆడాల్సి ఉండగా మొదటి మ్యాచ్ ఈనెల 10 వ తేదీన జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి తన సత్తా చాటుకోవడానికి ఇండియన్ టీమ్ రెడీ అవుతుంటే సౌతాఫ్రికా టీమ్ కూడా ఇండియన్ టీమ్ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసింది…
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం నుంచి ఏ ప్లేయర్ బరిలోకి దిగబోతున్నాడు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే టి20 సీరీస్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్లు అందరూ కూడా ఇంతకు ముందు ఆస్ట్రేలియా తో ఆడిన సీరీస్ లో తమదైన రీతిలో పర్ఫామెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వచ్చిన అవకాశాన్ని చాలా బాగా సద్వినియోగ పరచుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ మ్యాచ్ లో తుది జట్టు లో ఎవరు అవకాశాన్ని దక్కించుకుంటారు అనేది అర్థం కాని విషయం అనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీం ని బట్టి సౌతాఫ్రికా తో ఆడే మొదటి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒక ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ బరిలోకి దిగగా,మరో ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు బరి లోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి…ఇక వరుసగా ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్),సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్,రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్, ఆర్ష దీప్ సింగ్, ముకేష్ కుమార్,మహమ్మద్ సిరాజ్ లతో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి…
ఇక ఈ టీమ్ తో మొదటి మ్యాచ్ గెలిస్తే ఇండియన్ టీమ్ సౌతాఫ్రికా మీద ఆధిపత్యాన్ని చేలాయిస్తుంది…అందుకే ఇండియా టీమ్ మొదటి మ్యాచ్ గెలిస్తే ఇండియన్ టీమ్ ఈ సీరీస్ గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించేలా ప్లేయర్లు మంచి కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…