Homeబిజినెస్Top 5 Scooters: యూత్ నుంచి ఉద్యోగుల వరకు ఆకట్టుకునే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే..

Top 5 Scooters: యూత్ నుంచి ఉద్యోగుల వరకు ఆకట్టుకునే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే..

Top 5 Scooters: రోజువారి అవసరాలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణం చేయడానికి టూ వీలర్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అయితే ఒకప్పుడు టూ వీలర్ కొనడానికి వెనుకడుగు వేసిన వారు.. ఇప్పుడు బ్యాంకు లోను ఇతర అవకాశాలు ఉండడంతో ప్రతి ఒక్కరు దాదాపుగా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లోకి పెట్రోల్ తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని పెట్రోల్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇటీవల ప్రచురించిన కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని మోడల్స్ కు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే చాలామంది బైక్ కంటే స్కూటర్ లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మరి బెస్ట్ స్కూటర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి అవసరాలతో పాటు కార్యాలయ పనుల కోసం స్కూటర్ అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా నేటి యూత్ కు అనుగుణంగా కూడా ఇవి స్టైలిష్ గా రావడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఇలాంటి కంపెనీల్లో TVS ఒకటి. దీని నుంచి మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన జూపిటర్ 125 స్కూటర్ కు ఆదరణ పెరిగిపోతుంది. దీని ధర కూడా లక్ష రూపాయల లోపే ఉండడంతో చాలామంది దీనిపై ఇష్టం పెంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.84,150 నుంచి రూ.93,110 వరకు విక్రయిస్తున్నారు. 128 సీసీ పెట్రోల్ ఇంజన్ తో కలిగి ఉన్న ఈ స్కూటర్ లీటర్ ఇంధనానికి 50 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సులతోపాటు ఎలక్ట్రిక్ సైలెంట్ స్టార్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

Honda కంపెనీ నుంచి స్కూటర్ అనగానే Activa పేరు వినిపిస్తుంది. దీని ధర రూ.88,339 నుంచి రూ.94,096 వరకు విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్ లో 123.92 సిసి పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 50 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్ వంటివి ఉండడంతో రైడర్లకు సేఫ్టీగా ఉంటుంది. అలాగే స్మార్ట్ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి.

ఆటోమోబైల్ మార్కెట్లో Suzuki కంపెనీకి మంచి గుర్తింపు ఉంది.. దీని నుంచి సరసమైన ధరకే స్కూటర్ వస్తుందని చాలామంది భావన. అందుకు అనుగుణంగానే ఈ కంపెనీకి చెందిన Access స్కూటర్ ను రూ.81,508 ప్రారంభ ధర నుంచి రూ.1.01 లక్ష వరకు విక్రయిస్తున్నారు. అయితే పై రెండు మోడల్స్ కంటే దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇందులో 124 సిసి ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 45 నుంచి 64 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

అలాగే TVS కంపెనీకి చెందిన మరో మోడల్ Ntorq అనే మోడల్ యూత్ ను ఆకట్టుకుంటుంది. స్టైలిష్ గా కనిపించడానికి ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే ఇందులో 124.8 సిసి పెట్రోల్ ఇంజన్ ను అమర్చగా.. ఈ ఇంజన్ 47 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో యూఎస్బీ పోర్టు వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular