Homeలైఫ్ స్టైల్Myopia: చాపకింద నీరులా విస్తరిస్తున్న ‘మయోఫియా’.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Myopia: చాపకింద నీరులా విస్తరిస్తున్న ‘మయోఫియా’.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?

Myopia: ఆధునిక కాలంలో ప్రతీ పనిని టెక్నాలజీతో చేయాల్సి వస్తోంది. అన్ని రంగాలు సంప్రదాయ పద్ధతులు వదిలి సాంకేతికానికి అలవాడుపడుతున్నారు. అయితే కొన్నింటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యగా ఈరోజుల్లో మొబైల్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు సైతం మొబైల్ తో కనెక్ట్ అవుతున్నారు. దీని వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా అనేక కంటి జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కంటికి సంబంధించి ‘మయోఫియా’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా.. ఆ తరువాత కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలు ‘మయోఫియా’ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నివారణకు ఏం చేయాలి?

మయోఫియా.. ఇది ఎక్కువగా దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్ వంటి దేశాల్ల దీని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మయోఫియా అనేది కంటికి సంబంధించిన రుగ్మత. ఇది ఉన్న వారు దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని కళ్లద్దాలు తీసుకోవడంతో పాటు ఆపరేషన్ ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఇది రిపీట్ కూడా అయ్యే అవకాశం ఉందని కొందరు వైద్యుల చెబుతున్నారు.

మయోఫియా వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. ముందుగా దూరంగా ఉన్న వస్తువులు ఎక్కువగా కనిపించవు. ఏదైనా ఒక వస్తువును అదేపనిగా చూస్తే కళ్లపై ఒత్తిడి కలుగుతుంది. చదువుకునే విద్యార్థుల్లో మయోఫియా ఏర్పడితే వారికి క్లాస్ బోర్డుపై ఏం రాస్తున్నారో చూడలేరు. రాత్రి సమయంలో వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. అలాగే తరుచూ కళ్ల రెప్పులు కొట్టుకోవడం వీటి లక్షణాల్లో ఒకటి. ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చునేవారు, మొబైల్ ను కళ్లార్పకుండా చూసేవారు, దగ్గరగా బుక్ ను చూసేవారికి మయోఫియా ఏర్పడే అవకాశం ఉంది.

అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చేనేవారు. కనీసం అరగంటకు ఓ సారి బ్రేక్ ఇచ్చి.. 5 నుంచి 10 నిమిషాల పాటు అటూ ఇటూ చూడాలి. రాత్రిళ్లు మొబైల్ ను ఎక్కువగా చూడకుండా ఉండాలి. మయోఫియా ను డయోప్ట్రెస్ అని పిలిచే ఆప్టికల్ యూనిట్లలో కొలుస్తారు.

ఆధునిక కాలంలో ప్రతీ పనిని టెక్నాలజీతో చేయాల్సి వస్తోంది. అన్ని రంగాలు సంప్రదాయ పద్ధతులు వదిలి సాంకేతికానికి అలవాడుపడుతున్నారు. అయితే కొన్నింటిని ఉపయోగించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యగా ఈరోజుల్లో మొబైల్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు సైతం మొబైల్ తో కనెక్ట్ అవుతున్నారు. దీని వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో కళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా అనేక కంటి జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కంటికి సంబంధించి ‘మయోఫియా’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా.. ఆ తరువాత కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలు ‘మయోఫియా’ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నివారణకు ఏం చేయాలి?

మయోఫియా.. ఇది ఎక్కువగా దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్ వంటి దేశాల్ల దీని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మయోఫియా అనేది కంటికి సంబంధించిన రుగ్మత. ఇది ఉన్న వారు దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని కళ్లద్దాలు తీసుకోవడంతో పాటు ఆపరేషన్ ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఇది రిపీట్ కూడా అయ్యే అవకాశం ఉందని కొందరు వైద్యుల చెబుతున్నారు.

మయోఫియా వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. ముందుగా దూరంగా ఉన్న వస్తువులు ఎక్కువగా కనిపించవు. ఏదైనా ఒక వస్తువును అదేపనిగా చూస్తే కళ్లపై ఒత్తిడి కలుగుతుంది. చదువుకునే విద్యార్థుల్లో మయోఫియా ఏర్పడితే వారికి క్లాస్ బోర్డుపై ఏం రాస్తున్నారో చూడలేరు. రాత్రి సమయంలో వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. అలాగే తరుచూ కళ్ల రెప్పులు కొట్టుకోవడం వీటి లక్షణాల్లో ఒకటి. ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చునేవారు, మొబైల్ ను కళ్లార్పకుండా చూసేవారు, దగ్గరగా బుక్ ను చూసేవారికి మయోఫియా ఏర్పడే అవకాశం ఉంది.

అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే కంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చేనేవారు. కనీసం అరగంటకు ఓ సారి బ్రేక్ ఇచ్చి.. 5 నుంచి 10 నిమిషాల పాటు అటూ ఇటూ చూడాలి. రాత్రిళ్లు మొబైల్ ను ఎక్కువగా చూడకుండా ఉండాలి. మయోఫియా ను డయోప్ట్రెస్ అని పిలిచే ఆప్టికల్ యూనిట్లలో కొలుస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular