Congress Party : రామాలయ ప్రాణ ప్రతిష్ట ను వ్యతిరేకించి ప్రతిష్ట కోల్పోయిన కాంగ్రెస్

రామాలయ ప్రాణ ప్రతిష్ట ను వ్యతిరేకించి ప్రతిష్ట కోల్పోయిన కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: NARESH, Updated On : January 13, 2024 4:45 pm

Congress Party : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. దీంతో చర్చల్లా మోడీ 11 వాసుల ఉపవాస దీక్ష వర్సెస్ రాహుల్ గాంధీ బస్సు యాత్ర చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి..

వినాయకుడికి, కుమారస్వామికి పోటీ పెడుతారు. భూమి చుట్టూ తిరిగిరావాలని కండీషన్ పెట్టారు. తల్లిదండ్రులు చుట్టూ తిరిగిన వినాయకుడు గెలిచాడు. కుమారస్వామి ఓడిపోయారు.

భారత్ జోడో పాదయాత్ర చేసినా రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఏం చేయాలో తెలియక ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేస్తున్నారు. దేశమంతా ఇప్పుడు శ్రీరామాలయ ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. 75 శాతానికి పైగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇదీ.. సోనియా, మల్లికార్జున ఖర్గేలు అహ్వానం అందినా అయోధ్య ప్రారంభోత్సవానికి రాలేదు. బాయ్ కాట్ చేశారు. ఎక్కువమంది హిందువులు ఈ ఆలయ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సైతం అయోధ్య రామాలయానికి కాంగ్రెస్ పెద్దలు హాజరుకాకపోవడం తప్పు అని ప్రకటించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టడం ఎంత మాత్రం సందర్భం కాదు..

రామాలయ ప్రాణ ప్రతిష్ట ను వ్యతిరేకించి ప్రతిష్ట కోల్పోయిన కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు