Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమకాలిన క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులను సృష్టించిన ఘనత అతడి సొంతం. అయితే ఇదంతా ఇప్పుడు గతం. ఎందుకంటే అతడు తేలిపోతున్నాడు. ఒకప్పటిలాగా ఆడలేక పోతున్నాడు. అనామక బౌలర్ల ఎదుట తలవంచుతున్నాడు.. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విరాట్ అవుట్ అయిన తీరు అతని అభిమానులను నిర్వేదంలో ముంచుతోంది.. పూణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో భారత ఇన్నింగ్స్ సమయంలో విరాట్ అవుట్ అయిన తీరు చర్చకు దారితీస్తోంది. 9 బంతులను ఎదుర్కొన్న విరాట్ ఒక పరుగు మాత్రమే చేశాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఫుల్ టాస్ వేయగా..
సాంట్నర్ వేసిన ఫుల్ టాస్ బంతిని విరాట్ తప్పుగా అంచనా వేశాడు. వాస్తవానికి ఆ బంతిని అతడు మిడ్ వికెట్ మీదుగా ఆడాలని కోహ్లీ భావించాడు. కానీ క్రాస్ బ్యాటెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పడేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. కోహ్లీ తన సుదీర్ఘ కెరియర్ లో అత్యంత దారుణమైన, చెత్త షాట్ ఆడాడని వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు..
2021 నుంచి..
విరాట్ కోహ్లీ 2021 ఆసియా కప్ నుంచి ఔట్ అవుతున్న తీరు టీమిండియా మేనేజ్మెంట్ ను ఇబ్బందికి గురిచేస్తుంది. విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆసియా గడ్డపై విరాట్ కోహ్లీ గత మూడు సంవత్సరాలలో 26 ఇన్నింగ్స్ లలో 21సార్లు స్పిన్ సోదరుల చేతిలోనే అవుట్ అయ్యాడు. 28 సగటుతో స్పిన్ బౌలర్ల బౌలింగ్లో 606 రన్స్ మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 49.67 మాత్రమే కావడం విశేషం. ఇక విరాట్ 10 సార్లు ఎడమచేతి వాటం ఉన్న స్పిన్ బౌలర్ల చేతిలోనే అవుట్ కావడం విశేషం. కోహ్లీ ఇలా అవుట్ కావడం పట్ల అతడి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..” కోహ్లీ భయ్యా ఎలా ఆడుతున్నావో అర్థమవుతోందా.. ఎలాంటి వాడివి ఎలా అయిపోయావ్. ఇప్పటికైనా నీ బ్యాటింగ్ స్టైల్ మార్చుకో.. నీ దూకుడు కొనసాగించు. మునుపటి ఆట తీరును ప్రదర్శించు. ముఖ్యంగా నీ వీరోచిత బ్యాటింగ్ తో మమ్మల్ని అలరించు.. నీ స్టైల్ బ్యాటింగ్ చూడక చాలా రోజులు గడిచిపోయింది. ఈ పరుగుల దాహం తీర్చుకో. నీ అభిమానులమైన మమ్మల్ని అలరించు. నీ ఆటతీరుతో సమ్మోహితులను చేయి” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
THE Great Virat Kohli can’t even play a full toss pic.twitter.com/XNomySBHqt
— ADITYA (@140OldTrafford) October 25, 2024