https://oktelugu.com/

New 7 Seater Cars: మార్కెట్లోకి కొత్తగా వచ్చే 7 సీటర్ కార్లు ఇవే.. అదిరిపోయే ఫీచర్స్

కారు కొనాలని అనుకునే వారు ఎక్కువగా 7 సీటర్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా కార్ల కంటే ఈ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే ఈ వేరియంట్ లో వచ్చిన కార్లకు మంచి డిమాండ్ ఉంది.కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీ టూర్ కోసం 7 సీటర్ కార్లు చాలా వరకు ఉపయోగపడుతాయి

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2024 / 04:29 PM IST

    7-Seater-cars

    Follow us on

    New 7 Seater Cars: కారు కొనాలని అనుకునే వారు ఎక్కువగా 7 సీటర్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా కార్ల కంటే ఈ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే ఈ వేరియంట్ లో వచ్చిన కార్లకు మంచి డిమాండ్ ఉంది.కార్యాలయ అవసరాలతో పాటు ఫ్యామిలీ టూర్ కోసం 7 సీటర్ కార్లు చాలా వరకు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లగేజీ కి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే తాజాగా కొన్ని కంపెనీలు కొత్త 7 సీటర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా.. మారుతి ఎర్టీగా కు గట్టి పోటీ ఇచ్చేందుకురెడీ అవుతున్నాయి. ఈ కార్ల గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    నిస్సాన్ కంపెనీకి భారత మార్కెట్లో మంచి పేరు ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లు చాలా మంది వినియోగదారులు ఆదరిస్తున్నారు. తాజాగా దీని నుంచి కాంపాక్ట్ ఎంపీవీ రావడానికి సిద్ధంగా ఉంది. రెనాల్ట్ డ్రైబర్ ఆధారంగా ఉత్పత్తి అయిన ఈ కారు సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ నుల కలిగి ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు ఇది 71 బీహెచ్ పీ పరవ్, 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ. 6 లక్షల ప్రారంభ ధర నుంచి ప్రారంభం కానుంది. 7 సీటర్ కారు అంటే ధర ఎక్కువగా ఉంటుందని, దీని కొనుగోలుకు వెనుకడుగు వేస్తారు. కానీ ఈ కారు అతి తక్కువ ధరకే రావడంతో దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

    దేశంలో కియా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనినుంచి కొన్ని కార్లు ఎస్ యూవీలు కానప్పటికీ బూట్ స్పేస్ ఎక్కువగా ఉండి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే తాజాగా దీని నుంచి 7 సీటర్ కారు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కంపెనీ నుంచి 7 సీటర్ ఈవీ ని మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. వీటిలో ఒకటి కారెన్స్ ఈవీ.. మరొకటి సిరోస్ ఈవీ అనే రెండు కార్లు ఉన్నాయి. ఇవి 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటి ధర కూడా రూ. 10 లక్షల లోపే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు.

    మారుతి కంపెనీ నుంచి ఇప్పటికే ఎర్టిగా 7 సీటర్ అలరిస్తుంది. ఈ మోడల్ అమ్మకాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి కాంపాక్ట్ ఎంపీవీని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సొంత స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ తో ఉండొచ్చని అంటున్నారు. దీని ఇంజిన్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ మాదిరిగా ఉండనుంది. స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ లో ఉండే మోటార్ ను దీనికి అమర్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మరికొన్ని 7 సీటర్ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు రావ