Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం అన్ని టీమ్ లు కూడా తనదైన రీతిలో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో మొదట ఆడిన 4 మ్యాచుల్లో వరుసగా 4 విజయాలను అందుకున్న న్యూజిలాండ్ టీమ్ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ లకు మూడు మ్యాచ్ ల్లో ఓడిపోవడం జరిగింది… ఇక ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ టీం ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర ఇవాళ్ళ పాకిస్తాన్ మీద ఆడుతున్న మ్యాచ్ లో 108 పరుగులు చేసి వాళ్ల టీమ్ కి భారీ స్కోరు అందించడంతో పాటు గా ఈ టోర్నీ లో తను మూడో సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు…
అయితే రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ టీం తరఫున ఆడుతున్నప్పటికీ వాళ్ల నాన్న అయిన రవి కృష్ణమూర్తి మాత్రం ఇండియాకి చెందిన వ్యక్తి కావడం విశేషం… రవి కృష్ణమూర్తి బెంగుళూర్ లోని ఒక సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ గా పని చేసే వాడు ఇక ఆ క్రమంలోనే ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడ స్థిరపడడం జరిగింది. ఇక 1999 వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన రచిన్ రవీంద్ర జన్మించడం జరిగింది. అయితే తన యంగ్ ఏజ్ లో రవి కృష్ణమూర్తి మాత్రం అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ ఉండేవాడు ఇంకా ఇలాంటి క్రమంలోనే తనకి సచిన్ టెండుల్కర్ , రాహుల్ ద్రావిడ్ అంటే ఇష్టం ఉండడంతో వాళ్ళిద్దరి పేర్లు కలిసే విధంగా తన కొడుక్కి రచిన్ రవీంద్ర అనే పేరు పెట్టడం జరిగింది… ఇక ఈ క్రమంలోనే ఈయన ఇవాళ్ల పాకిస్తాన్ మీద చేసిన సెంచరీ అనేది ఒక అద్భుతమైన సెంచరీ అనే చెప్పాలి. ఇక న్యూజిలాండ్ డూ ఆర్ డే మ్యాచ్ ఆడుతుంది ఇది గెలిస్తే న్యూజిలాండ్ సెమీస్ కి వస్తుంది లేకపోతే ఇంకా కష్టం అవుతుంది ఇక ఇలాంటి పరిస్థితి లో తన టీం కి అండగా ఉంటూ ఈ టోర్నీ లో రచిన్ రవీంద్ర తన మూడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
తను న్యూజిలాండ్ దేశం తరఫున ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ అయినప్పటికీ ఆయన మొదటి వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలను సాధించిన యంగ్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కాడు… ఇక ఇదంతా చూసిన ఇండియన్ అభిమానులు సైతం రచిన్ రవీంద్ర భారతీయ సంతతికి చెందిన వాడు కాబట్టి ఆయన వరుస సెంచరీలు చేస్తున్నాడు. భారతీయ సంతతికి చెందినవాడు కావడం వల్ల క్రికెట్ అనేది ఆయన బ్లడ్ లోనే ఉంది అంటూ చాలామంది ఇండియన్ అభిమానులు సైతం రచిన్ రవీంద్ర కి సపోర్టుగా మాట్లాడుతూ ఆయన మన వాడే అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది…
ఇక కొందరైతే రచిన్ రవీంద్ర భారతీయ సంతతి కి చెందిన వాడు కావడం వల్ల ఆయన బాడీలో భారతీయ సంతతికి చెందిన బ్లడ్ ఉంది కాబట్టే ఆయన ఇండియా కి శత్రు దేశం అయిన పాకిస్తాన్ బౌలర్ల మీద విరుచుకుపడి మరి పాకిస్థాన్ మీద సెంచరీ సాధించాడు అంటూ తన గురించి గర్వంగా చెప్తున్నారు…ఇక ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లు ఆడిన రచిన్ రవీంద్ర అందులో మూడు సెంచరీ లు చేసి 523 పరుగులు చేసి 74.71 ఆవరేజ్ తో టోర్నీ లో సెకండ్ హైయ్యేస్ట్ రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు….