Congress : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య ఎందుకు?

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య ఎందుకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 4, 2023 5:58 pm

Congress : వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా చెప్పొచ్చు. ఎందుకంటే గెలవచ్చు.. గెలవకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకే ఇది జీవన్మరణ సమస్యగా దాపురించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు.. రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లో దాదాపు పోయినసారి అధికారానికి చేరువగా ఉంది. కేవలం 2 సీట్లే తక్కువ వచ్చాయి.

ఇప్పుడు ఏం అనుకుంటున్నారు జనం అని చూస్తే.. ఈ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ కు ఉన్నట్టువంటి బలమైన రాష్ట్రాల్లో ఈ మూడు ముఖ్యమైనవి.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, కర్నాటకల్లో బలంగా ఉంది కాంగ్రెస్. ఈ మూడు హిందీ రాష్ట్రాలు. హిందీ భాష మాట్లాడే చోట గెలవకుండా దేశంలో అధికారం ఎవరూ చేపట్టలేరు. ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందని చూస్తే.. మూడు రాష్ట్రాల్లో టగ్ ఆఫ్ ఫోర్ నడుస్తోంది.

చత్తీస్ ఘడ్ నల్లేరు మీద నడక కాంగ్రెస్ కు అనుకుంటున్నారు.కానీ అక్కడ కూడా పోటీ చాలా టైట్ గా ఉంది. ఎవరు గెలిచినా 1 శాతం లేదా 2 శాతం మాత్రమే తేడా ఉందని అంటున్నారు. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారో చెప్పలేం. రాజస్థాన్ లో బీజేపీకి ఎడ్జ్ ఉందని.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉందని అంటున్నారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే.. వాళ్లకు అధికారం దక్కలేదు. కేసీఆర్ పై వ్యతిరేకతనే కాంగ్రెస్ గెలుపునకు కారణంగా ఉంది. మిజోరంలో మిజో నేషనల్ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య ఎందుకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.