Champions trophy 2025: ఇంగ్లాండ్ జట్టు(England cricket team) మూడు వన్డేలు, టీ -20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.. జట్టు కూర్పులో ఈసారి బిసిసిఐ సెలక్షన్ కమిటీ సరికొత్త విధానాన్ని పాటించింది. తెలుగు ఆటగాళ్లకు బిసిసిఐ సెలక్షన్ కమిటీ మొండి చేయి చూపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో కనీసం తెలుగు ఆటగాళ్లకు ప్రాతినిధ్యం లభించకుండా పోయింది.
కొంతకాలంగా టీం ఇండియాలో పూర్తిస్థాయి ఆటగాడిగా మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) కొనసాగుతున్నాడు. అయితే అతనిపై కూడా మేనేజ్మెంట్ వేటు వేసింది. అతడి స్థానంలో యువ పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కు చోటు లభించింది. కొన్ని సంవత్సరాలుగా సిరాజ్ జట్టులో నిలకడగా స్థానాన్ని నిలుపుకుంటున్నాడు. అవకాశాలను దక్కించుకుంటున్నాడు. అయితే ఆస్ట్రేలియా టూర్ లో సిరాజ్ తన ప్రతిభను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతడిని దూరం పెట్టింది.. బుమ్రా(Bhumra)ఫిట్ నెస్ కూడా సక్రమంగా లేకపోవడంతో.. సిరాజ్ కు బదులుగా అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త బంతితో మాత్రమే ప్రభావం చూపించే సిరాజ్.. బంతి పాతపడే కొద్దీ సత్తా చాటలేడు .మిడిల్, బ్యాక్ ఎండ్ లో అతడు ఏమాత్రం ప్రభావం చూపించలేడు. అందువల్లే సిరాజ్ ను దూరం పెట్టారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పై అర్థమే వచ్చేలాగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిరాజ్ కెరియర్ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. అతడు మళ్ళీ రంజీ వైపు చూసే లాగా పరిస్థితి ఏర్పడింది.
నితీష్ కుమార్ రెడ్డికి కూడా..
ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ స్ఫూర్తిదాయకమైన ఆట ఆడాడు. అయినప్పటికీ అతడికి అవకాశం లభించలేదు..పేస్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డిని కేవలం రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే సెలక్ట్ చేశారు.. రిజర్వ్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, ఆవేష్ ఖాన్ జట్టులో ఉంటారు.. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా మాత్రమే నితీష్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తాడు.. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక గాయపడితే నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు లభిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తిలక్ వర్మ
ఇటీవలి టి20 సిరీస్ లలో తిలక్ వర్మ అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మాట్ లో అతడికి అవకాశం లభించలేదు.. తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ లో అదరగొట్టాడు. వరస సెంచరీలతో హోరెత్తించాడు. అయినప్పటికీ అతనిని సెలక్షన్ కమిటీ లెక్కలోకి తీసుకోలేదు.. ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు ఆటగాళ్లు సిరాజ్, తిలక్ వర్మ, కుమార్ రెడ్డికి ఏమాత్రం అవకాశం లభించలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, షమీ, బుమ్రా, కులదీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా(రిజర్వ్ ప్లేయర్), జైస్వాల్.