Pawan Kalyan : రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు ఆయన చేస్తున్న మంచి పనులు చూస్తూ ఎంతో గర్విస్తున్నారు. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అనుకున్న గమ్య స్థానాన్ని 70 శాతం చేరుకున్నాడు. కానీ సినిమాల్లో మాత్రం అభిమానులకు చాలా బాకీ ఉన్నాడు. ఆయన నుండి ఇండస్ట్రీ షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చి పదేళ్లు దాటింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ రెండవ పడవల మీద ప్రయాణం చేయడం వల్ల పూర్తి స్థాయిలో సినిమాల మీద ఫోకస్ చేయలేదు. ‘గోపాల గోపాల, ‘బ్రో ది అవతార్’ వంటి ముఖ్య పాత్రలు పోషించిన సినిమాలను పక్కన పెడితే, ఆయన లీడ్ రోల్ లో చేసిన సినిమాలు ‘అత్తారింటికి దారేది’ తర్వాత కేవలం 5 మాత్రమే.
అందులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు గా నిలిచాయి. ఆ తర్వాత భారీ గ్యాప్ తో విడుదలైన ‘వకీల్ సాబ్’ చిత్రం బాగానే ఆడింది. కానీ కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్న రోజులు కావడంతో థియేటర్స్ ని మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో భారీ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా వంద కోట్ల షేర్ లోపే క్లోజ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘భీమ్లా నాయక్’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. కానీ టికెట్ రేట్స్ భారీగా తగ్గించడం వల్ల ఇది కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోలేకపోయింది. ఇక ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాలేదు. ఈ చిత్రం తర్వాత మార్కెట్ లో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న హీరోలు కూడా వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే స్థాయికి చేరుకున్నారు.
ఇలాంటి మార్కెట్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఊహకి అందని రేంజ్ లో ఉంటాయి. మార్చి 28న ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. అభిమానులు తమ ఆకలి తీరుస్తుందని, ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం మార్చి 28న విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బ్యాలన్స్ ఉందట. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారం రోజుల షూటింగ్ కూడా మిగిలి ఉందట. VFX వర్క్, 3D వర్క్ పూర్తి అవ్వడానికి సమయం గట్టిగా పట్టేలా ఉంది. అందుకే మేకర్స్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఓజీ చిత్రం పూర్తి అవ్వడానికి కూడా చాలా సమయం ఉంది, కాబట్టి ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే అని అంటున్నారు విశ్లేషకులు.