Pakistan Vs India: ఆసియా కప్ లో పాకిస్తాన్ ఊహించినట్టు ఫలితం రాలేదు. ఇండియా ఆశించినట్టు మరోసారి ట్రోఫీ సొంతమైంది. తద్వారా ఆసియా కప్ చరిత్రలోనే టీమ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏ జట్టుకు సాధ్యం కానీ ఘనతను సొంతం చేసుకుంది. 41 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆసియా కప్ లో ఏకంగా 9సార్లు విజేతగా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది.
తాజా ఆసియా కప్ లో ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ సాధించిన విజయంలో బౌలింగ్ పరంగా కులదీప్ యాదవ్ (నాలుగు వికెట్లు).. బ్యాటింగ్ పరంగా తిలక్ వర్మ (63* పరుగులు) అదరగొట్టారు. వీరిద్దరి అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో కీలకమైన మూడు వికెట్లు 20 పరుగులకు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడిన టీమిండియాలో తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే ఆదుకున్నారు. వీరు ముగ్గురు సమయోచితంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. తద్వారా పాకిస్తాన్ జట్టుకు మరో ఓటమిని మిగిల్చి.. ఆసియా కప్ ను దక్కించుకున్నారు..
టీమిండియా విజయం సాధించిన తర్వాత భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ లో ఉద్వేగం తారస్థాయికి చేరింది. జట్టు విజయం సాధించిన అనంతరం వెంటనే తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద చేతి పిడికిలి తో పదేపదే కొట్టి తన ఆనందాన్ని.. తన ఉద్యోగాన్ని పంచుకున్నాడు గౌతమ్ గంభీర్. వాస్తవానికి గౌతమ్ గంభీర్లో ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఆగ్రహాన్ని ఎన్నడూ చూడలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత గట్టిగా ఆ లింగనం చేసుకున్నాడు గౌతమ్ గంభీర్. సాధించావు అంటూ.. భుజాలను గట్టిగా నిమిరాడు. పహల్గాం దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరడ నేపథ్యంలో.. ఆసియా కప్ ఈసారి ఉత్కంఠ గా సాగింది. ఫైనల్లోకి పాకిస్తాన్, భారత వెళ్లడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయినప్పటికీ భారత జట్టు వరుస విజయాలు సాధించి పాకిస్తాన్ జట్టుకు ఏడుపును మిగిలించింది.