pakistan vs india : భారత్, పాక్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్, భారత్ తొలిసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ మొదట్లో ఉత్కంఠ గా సాగినప్పటికీ.. చివరికి భారత బౌలర్లు పై చేయి సాధించడంతో పాకిస్తాన్ జట్టు 146 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ జోరును చివరి వరకు కొనసాగించలేకపోయింది. భారత బౌలర్లు పై చేయి సాధించడంతో పాకిస్తాన్ జట్టు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఆ తర్వాత వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.
సహజంగానే పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ అంటే ఉత్కంఠ తారస్థాయిలో ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతుందని.. ఆసియా కప్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ లీవ్ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే హైప్ పెంచడంలో విజయవంతమైంది. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ సందర్భంగా యాడ్ టారిఫ్ అమాంతం పెంచేసింది. 10 సెకండ్ల పాటు యాడ్ ప్రసారం చేస్తే 16 లక్షలను వసూలు చేస్తోంది . టైమ్స్ నౌ నివేదిక ప్రకారం మెయిన్ స్పాన్సర్ నుంచి 18 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ నుంచి 13 కోట్లు, స్పాట్ బై ప్యాకేజీ కింద 16 లక్షలు.. ఒకవేళ ప్రైమ్ టైంలో నిర్విరామంగా యాడ్స్ టెలికాస్ట్ కు 4.48 కోట్లు వసూలు చేస్తుంది.
2031 వరకు టీమిండియా మన దేశం అవతల ఆడే మ్యాచ్ ల ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. దీనికి తగ్గట్టుగానే యాడ్ టారిఫ్ లను పెంచేసింది. ఓ నివేదిక ప్రకారం ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ ఫైనల్ వెళ్లడంతో.. సోనీకి పైసా వసూల్ అవుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. “భారత్, పాకిస్తాన్ ఫైనల్ వెళ్లిపోయాయి. ఫైనల్ లో నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనీ లీవ్ కు కాసుల పంట పండుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఏ స్పోర్ట్స్ ఛానల్ కూడా ఇంత భారీ టారిఫ్ అమలు చేయలేదు. అంతటి ఐపీఎల్లో కూడా ఈ స్థాయిలో టారిఫ్ అమలులో లేదు. ఎంతైనా సోనీ టీవీ అదృష్టం చేసుకుని ఉంటుందని” ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో భారత్ గనుక గెలిస్తే ధరలో తేడాలు ఉంటాయని తెలుస్తోంది.