pakistan vs india : ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తడబడుతోంది. భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్ 12, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 1 తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో భారత్ 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చిన సంజు (4), తిలక్ వర్మ (18) బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే నాలుగో వికెట్ కు 15 బంతుల్లో 20 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పాకిస్తాన్ బౌలర్లు ప్రారంభంలోనే మూడు వికెట్లు తీయడంతో.. భారత జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మ, సంజు ఆచితూచి ఆడుతున్నారు. అవసరమైతే తప్ప భారీ షాట్ల జోలికి వెళ్లడం లేదు. పిచ్ కూడా విభిన్నంగా స్పందిస్తుండడంతో పరుగులు తీయడం కష్టంగా మారింది. దీంతో టీమ్ ఇండియా గెలుపు పై ఉత్కంఠ ఏర్పడింది.. ప్రస్తుతానికయితే గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతోంది.
టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ బోర్డర్ షాహిన్ ఆఫ్రిది వేసిన మూడో ఓవర్ మూడో బంతిని సూర్య కుమార్ యాదవ్ షాట్ ఆడాడు. పాకిస్తాన్ కెప్టెన్ అఘా ముందుకు వచ్చి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. క్యాచ్ ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. అయితే బంతి ఫీల్డర్ చేతుల్లో కాకుండా నేలపై బౌన్స్ అయిందని.. అది నాటౌట్ అని కొంతమంది పేర్కొంటున్నారు. మరికొందరేమో క్లియర్ అవ్వటానికి పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సూర్య కుమార్ యాదవ్ అవుట్ కావడం జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ సిరీస్లో లీగ్ దశలో పాకిస్తాన్ జట్టుపై అతడు చేసిన 47 పరుగులే హైయెస్ట్ స్కోర్. ఇంతవరకు అతడు ఆ స్థాయిలో మరో ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడివి అయి ఉండి ఇలా ఆడతావా అంటూ మండిపడుతున్నారు.