Mitchell Santner: ఛాంపియన్స్ ట్రోఫీలో (champions trophy) న్యూజిలాండ్ జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా (NZ vs SA) జట్టుతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం పాకిస్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు అన్ని రంగాలలో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయాన్ని అందుకుంది.
Also Read: డియర్ మిల్లర్.. కివీస్ గెలిచినా.. చివరి 25 బంతుల్లో నీ ఆటకు హాట్సాఫ్ అంతే..
ఈ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.. న్యూజిలాండ్ – భారత్ (IND vs NZ) మధ్య గ్రూప్ దశలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 246 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 205 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. తద్వారా వరుస విజయాలతో టీమిండియా గ్రూప్ ఏ దశలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఘనవిజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తో సాధించిన విజయం అనంతరం సాంట్నర్ విలేకరులతో మాట్లాడాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ గురించి అతడు ప్రస్తావించాడు..” దక్షిణాఫ్రికా తో సాధించిన విజయం మాకు గొప్పగా అనిపించింది. దక్షిణాఫ్రికా మాకు కఠినమైన సవాల్ విసిరింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా మళ్లీ మేము దుబాయిలోకి అడుగు పెట్టాల్సి వస్తోంది. ఇక ఇప్పటికే అక్కడ ఒక మ్యాచ్ ఆడాం. అందులో ఓడిపోయాం. కానీ ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాను ఒత్తిడికి గురి చేసామనే భావన మాలో ఉంది.. టీమ్ ఇండియాను అలా ఒత్తిడికి గురిచేసి లాహర్ లోకి అడుగు పెట్టాం. ముందుగా బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికాపై భారీ స్కోరు చేశాం..రచిన్, కేన్ విలియంసన్ అద్భుత శతకాలు సాధించారు. వారిద్దరు భారీ స్కోర్ కు బాటలు వేశారు. మా జట్టులో నలుగురు స్పిన్ బౌలింగ్ వేయగలరు.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా చేయగలరు. అందువల్లే నా పనిని వారు సులభతరం చేశారు. మ్యాట్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈలోగా అతడు సిద్ధమవుతాడని భావిస్తున్నాం. భారత్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఇంకా సమయం ఉంది. భారత్ తో జరిగే పోటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఒక్కోసారి టాస్ కూడా కోల్పోవడం జట్టు విజయాలను నిర్దేశిస్తుందని” సాంట్నర్ వ్యాఖ్యానించాడు.
బవుమా ఏమన్నాడంటే..
ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా(Temba Bavuma) కీలక వ్యాఖ్యలు చేశాడు..” న్యూజిలాండ్ మా ముందు ఉంచిన టార్గెట్ చాలా ఎక్కువ. ఒకవేళ 350 పరుగుల లోపు ఆ టార్గెట్ గనుక ఉండి ఉంటే మాకు చేజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. మేము కొన్ని భాగస్వామ్యాలు మెరుగ్గా నిర్మించినప్పటికీ అవి ఎందుకూ సరిపోలేదు..125/1 పరుల వద్ద ఉన్నప్పుడు నేను, వాండర్ డసెన్ గట్టిగా ఆడాల్సి ఉండేది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తే ఫలితం మరో విధంగా ఉండేది. ప్రత్యర్థికి వికెట్లు ఇవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఒకవేళ కివిస్ 350 స్కోర్ మాత్రమే చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరే విధంగా ఉండేదని” టెంబా బవుమా(పేర్కొన్నాడు.
Also Read: అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోపు.. దురదృష్టం బాల్కనీలో వచ్చి కూర్చుంది.. ఇదేం దరిద్రం రా అయ్యా..