Champions Trophy 2025: ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఓవర్ కు అయిదు పరుగుల కంటే ఎక్కువ రన్ రేట్ తో ఏకంగా 141 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. నాటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 117(130) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తద్వారా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యాన్ని నిర్మించినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు ఆ స్థాయిలో ఆడోరలేకపోయారు. అందువల్లే భారత్ 264 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ఆరు ఓవర్లలో 37 పరుగులు చేసి, రెండు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ పరిస్థితి 132/5 వద్దకు చేరుకుంది. కానీ ఆ తర్వాత క్రిస్ కైర్న్స్ , క్రిస్ హారిస్ 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అప్పటిదాకా న్యూజిలాండ్ బ్యాటర్ల పై తమ ప్రతాపాన్ని చూపించిన టీమ్ ఇండియా బౌలర్లు.. ఒకసారి గా లయ తప్పారు. దీంతో హారీస్, కైర్న్స్ నిర్గడరు.. ముఖ్యంగా కైర్న్స్ 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు.. జట్టును విజయపథంలో నడిపించాడు. ప్రారంభంలో కైర్న్స్ నిదానంగా ఆడాడు. ఆ తర్వాత ఏడా పెడా బౌండరీలు కొట్టాడు. భారత బౌలర్ల పై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తద్వారా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టును గెలిపించాడు. దీంతో నాకౌట్ టోర్నీని న్యూజిలాండ్ గెలుచుకుంది.
Also Read: డియర్ మిల్లర్.. కివీస్ గెలిచినా.. చివరి 25 బంతుల్లో నీ ఆటకు హాట్సాఫ్ అంతే..
ఈ ట్రోఫీకి కెన్యా జట్టు ఆతిథ్యమిచ్చింది. జింఖానా క్లబ్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. నాకౌట్ టోర్నీలో టెస్ట్ ప్లేయింగ్ జట్లు మొత్తం పాల్గొన్నాయి. బంగ్లాదేశ్, కెన్యా కూడా ఈ టోర్నీలో పాల్గొన్నాయి. మొత్తంగా 11 జట్లు నాకౌట్ టోర్నీలో తలపడ్డాయి. ఈ టోర్నీలో టీమ్ ఇండియా తరఫున సౌరవ్ గంగూలీ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. అతడు ఏకంగా 348 పరుగులు చేశాడు. ఇక భారత జట్టు తరఫున వెంకటేష్ ప్రసాద్ హైయెస్ట్ గా 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు . ఈ టోర్నీ 2000 సంవత్సరం అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ 15 వరకు జరిగింది. నాకౌట్ విధానంలో ఈ టోర్నీ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో గెలవడం ద్వారా న్యూజిలాండ్ తొలిసారిగా నాకౌట్ టోర్నీని దక్కించుకుంది. ఆ తర్వాత భారత జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో భారత జట్టు కఠిన నిర్ణయాలు తీసుకుంది.
Also Read: అదృష్టం మెయిన్ డోర్ తట్టేలోపు.. దురదృష్టం బాల్కనీలో వచ్చి కూర్చుంది.. ఇదేం దరిద్రం రా అయ్యా..