Janhvi Kapoor : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) తర్వాత బుచ్చి బాబు(Buchi babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గ్రామీణ నేపథ్యం లో ఉండే సినిమా తీస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో రంగస్థలం చిత్రంతో అందరూ చూసారు. మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దానికి తోడు ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో, తదుపరి సినిమాతో ఎలా అయినా పెద్ద సూపర్ హిట్ కొట్టాలని అభిమానులు కసితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మినిమం గ్యారంటీ చిత్రాన్ని ఇచ్చినా సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా వేరే లెవెల్ కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకొని రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం మూడవ షెడ్యూల్ ని ఢిల్లీలో జరుపుకుంటుంది.
Also Read : ”అందుకు కరెక్ట్ గా సరిపోతుంది”.. జాన్వీ కపూర్ పై కండోమ్ కంపెనీ అధినేత షాకింగ్ కామెంట్స్!
ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్(Jhanvi Kapoor) పుట్టిన రోజు కావడంతో ఆమెకి సంబంధించిన ఒక లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. టీ షర్ట్, నైట్ ప్యాంట్ వేసుకొని చేతిలో ఒక గొర్రె పిల్లని పట్టుకొని కనిపించిన జాన్వీ కపూర్ లుక్ ని చూసి, ఇదేంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా అన్నారు, ఇక్కడ చూస్తే ఈమె మోడరన్ లుక్ లో కనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ‘దేవర’ లాంటి సూపర్ హిట్ తర్వాత జాన్వీ కపూర్ తెలుగులో చేస్తున్న రెండవ సినిమా ఇది. ‘దేవర’ చిత్రం కమర్షియల్ గా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం జాన్వీ కపూర్ సాంగ్. ఆమెలో మంచి యాక్టింగ్ పొటెన్షియల్ కూడా ఉంది, కానీ డైరెక్టర్ సరిగా ఆమెని వినియోగించుకోలేదు అని విమర్శలు వచ్చాయి.
కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో ఆమెకు నటించడానికి మంచి స్కోప్ ఉన్న క్యారక్టర్ పడినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ కూడా హిట్ అయితే ఇక జాన్వీ కపూర్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ ని ఎలేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ చిత్రం కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా నిన్ననే చేసారు. తదుపరి షెడ్యూల్ నుండి ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇలా ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, అక్టోబర్ నెలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇదే స్పీడ్ లో ముందుకు పోతే అక్టోబర్ లో విడుదల చేయొచ్చు అంటి అంటున్నారు విశ్లేషకులు.
Also Read : ఆ గుడిలో పెళ్లి, బాంబు పేల్చిన దేవర బ్యూటీ జాన్వీ కపూర్!