Team India Schedule
Team India : ఐపీఎల్(IPL)సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా(team India) స్వదేశం వేదికగా వన్డే, టీ 20, టెస్ట్ సిరీస్ లు ఆడనుంది.. దీనికి సంబంధించి బిసిసిఐ(BCCI) వివరాలు వెల్లడించింది.. అక్టోబర్ నెలలో వెస్టిండీస్ జట్టుతో టీమిండియా రెండు టెస్టులు ఆడుతుంది. నవంబర్, డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు t20 లలో టీమిండియా తలపడుతుంది. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడుతుంది.. విశాఖపట్నం వేదికగా భారత్ చివరగా 2023లో మార్చేలలో వన్డే మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఆ మ్యాచ్ లో టీమిండియా దారుణమైన ఓటమికి గురైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఈ మ్యాచ్లో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.
Also Read : ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని దెబ్బ
షెడ్యూల్ ఇదే
వెస్టిండీస్ జట్టుతో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి ఆరు వరకు సాగుతుంది.
రెండవ టెస్ట్ కోల్ కతా వేదికగా అక్టోబర్ 10 నుంచి 14 వరకు సాగుతుంది.
సౌత్ ఆఫ్రికా తో సిరీస్..
సౌత్ ఆఫ్రికా జట్టుతో తొలి టెస్ట్ ఢిల్లీ వేదికగా నవంబర్ 14 నుంచి 18 వరకు సాగుతుంది.
రెండవ టెస్ట్ గుహవాటి వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు సాగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో తొలివన్డే నవంబర్ 30న రాంచి వేదికగా జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో రెండవ వన్డే డిసెంబర్ 3న రాయ్ పూర్ వేదికగా జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో మూడవ వన్డే విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 6న జరుగుతుంది.
ఇక దక్షిణాఫ్రికా జట్టుతో తొలి టి20 మ్యాచ్ డిసెంబర్ 9న కటక్ వేదికగా జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో రెండవ టి20 మ్యాచ్ చండీగఢ్ వేదికగా డిసెంబర్ 11న జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో మూడవ టి20 మ్యాచ్ ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో నాలుగో t20 మ్యాచ్ లక్నో వేదికగా డిసెంబర్ 17న జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టుతో ఐదవ టి20 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా డిసెంబర్ 19న జరుగుతుంది.
వన్డే, టి20 ఫార్మాట్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్, టి20 సిరీస్ గెలిచింది. ఇక టీమిండియా టి20 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. గత ఏడాది శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతమైన విజయాన్ని సాధించి.. ట్రోఫీని అందుకుంది.
Also Read : ఓహో అనికేత్ వర్మ బాదుడు వెనుక అసలు మంత్రం ఇదా?!