Jaspreet Bumrah
Jaspreet Bumrah : దీపక్ చాహర్, అశ్వని కుమార్, హార్దిక్ పాండ్యా వంటి వారు ఉన్నప్పటికీ ముంబై జట్టులో బుమ్రా(Jaspreet Bumrah) లేని లోటును ఎవరూ తీర్చలేక పోతున్నారు.. దీంతో ముంబై జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది..కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి.. టచ్ లోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ బుమ్రా లేని లోటు అలాగే కనిపిస్తోంది. అయితే అతడు ఎప్పుడు వచ్చి జట్టులో చేరుతాడు.. బౌలింగ్ చేస్తాడనేది ఇంతవరకు సస్పెన్స్ గానే ఉంది. దీనిపై జట్టు మేనేజ్మెంట్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ లో బౌలింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో ముంబై జట్టులోకి అతడు త్వరలో ఎంట్రీ ఇస్తాడని.. తన బౌలింగ్ ద్వారా ఆకట్టుకుంటాడని వార్తలు వినిపించాయి. అయితే అతడు ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది..
Also Read : పుట్టినరోజు నాడు బుమ్రా కు కొంచెం తీపి.. మరి కొంచెం చేదు..
పూర్తిస్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నాడు
విశ్రాంతి లేని క్రికెట్ ఆడిన బుమ్రా వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. గతంలో అతడు సర్జరీ కూడా చేయించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టాడు. అయితే సిడ్నీ టెస్టులో అతడికి వెన్నునొప్పి తిరగబెట్టడంతో వెంటనే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా అతడు మైదానంలోకి అడుగు పెట్టింది లేదు. అతడిని పరీక్షించిన వైద్యులు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. న్యూజిలాండ్ నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా అతని కోసం వచ్చింది. అతడిని పరీక్షించి.. సర్జరీ అయిన చోట మరోసారి శస్త్రచికిత్స చేస్తే ఇబ్బంది తప్పదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాడు. అతడి వెన్నునొప్పి కొంతవరకు తగ్గినప్పటికీ.. ఐపీఎల్ లో ఆడేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇటీవల అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే పూర్తిస్థాయిలో అతడు బంతులు వేయలేకపోతున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్రమంగా అతడు తన వర్కులోడు పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే తీరుగా అతడు గనుక బౌలింగ్ చేస్తే మరో రెండు వారాల్లో ముంబై జట్టులోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది..” అతడు బంతులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే వాటిలో అంత వేగం లేదు. అతడు వర్క్ లోడ్ తనపై క్రమేపి పెంచుకుంటున్నాడు. దీనివల్ల ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఇంకా రెండు వారాల వరకు బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉండాల్సి ఉంటుందని” బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా గత సీజన్లోనూ ఆడినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు.. వికెట్లు కూడా పెద్దగా పడగొట్టలేకపోయాడు.
Also Read : బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా.. MI లో ఎంట్రీ అప్పుడే..