https://oktelugu.com/

Creta Electric vs e vitara : త్వరలో మార్కెట్లో మారుతి ఈ విటారా.. హ్యుందాయ్ క్రెటా షెడ్డుకెళ్లాల్సిందేనా ?

Creta Electric vs e Vitara : కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో మారుతి ఈ-విటారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE6, MG ZS EVలతో పోటీపడుతుంది. హ్యుందాయ్ క్రెటా EV మార్కెట్లో ఓ పాపులర్ ఎలక్ట్రిక్ కారు. ఇది ఈ సంవత్సరం జనవరిలో విడుదలైంది. ఈ కథనంలో క్రెటాకు ఇ విటారాకు మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

Written By: , Updated On : April 2, 2025 / 08:36 PM IST
Creta Electric vs e vitara

Creta Electric vs e vitara

Follow us on

Creta Electric vs e vitara : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది. ఈ కారు కాంపాక్ట్ SUV మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) ఎలక్ట్రిక్ వెర్షన్. దీనికి ఈ-విటారా (e-Vitara) అని పేరు పెట్టారు. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో మారుతి ఈ-విటారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE6, MG ZS EVలతో పోటీపడుతుంది. హ్యుందాయ్ క్రెటా EV మార్కెట్లో ఓ పాపులర్ ఎలక్ట్రిక్ కారు. ఇది ఈ సంవత్సరం జనవరిలో విడుదలైంది. ఈ కథనంలో క్రెటాకు ఇ విటారాకు మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

Also Read : తిరిగినన్ని రోజులు తిరగండి నచ్చకపోతే ఇచ్చేయండి..లూనా మైండ్ బ్లోయింగ్ ఆఫర్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆఫ్షన్లలో వస్తుంది. 42kWh బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. మరోవైపు పెద్ద 51.4kWh బ్యాటరీ వేరియంట్ 473 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. టాప్ వేరియంట్ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 10-80 శాతం వరకు కేవలం 58 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

ఈ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. 49 kWh, 61 kWh యూనిట్లు. పెద్ద 61 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ లభించే అవకాశం ఉంది. అయితే 49 kWh బ్యాటరీ ప్యాక్ కూడా మంచి రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు, అయితే ఖచ్చితమైన గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. టాప్ మోడల్ 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో పిక్సలేటెడ్ గ్రిల్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్, 17-అంగుళాల ఏరో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. లోపల డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, 72 లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో కూడిన లెవెల్ 2 ADAS ఉన్నాయి. ఇందులో వెహికల్-టు-లోడ్ (V2L) ఫంక్షనాలిటీ, i-Pedalతో రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ-విటారాలో ట్విన్-డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో డిజిటల్ కాక్‌పిట్, 10.25-ఇంచుల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, హర్మన్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ అందించారు. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు , 40:20:40 స్ప్లిట్ రియర్ సీటు ఉన్నాయి. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS, లేటెస్ట్ బ్యాటరీ సేఫ్టీ సిస్టమ్ కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేర్వేరు డిజైన్‌లతో వస్తాయి. రెండు SUVలు వాటి ICE వేరియంట్‌ల వలెనే కనిపిస్తాయి. ఈ-విటారా పెద్ద చక్రాలు, క్లాడింగ్‌తో షార్ప్, చంకీ లుక్‌ను కలిగి ఉంది. అయితే క్రెటా ఎలక్ట్రిక్ ఫ్లాట్ రూఫ్‌తో మరింత సమకాలీన, క్లీన్ డిజైన్‌ను కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధర బ్యాటరీ, వేరియంట్‌ను బట్టి రూ.17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ.23.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మారుతి సుజుకి ఈ-విటారా ధర ఇంకా వెల్లడించలేదు.

Also Read : పెట్రోల్, డీజిల్ కార్లకు గుడ్ బై.. కాలుష్యంపై కేంద్రం ప్లాన్ ఇదే