Homeక్రీడలుక్రికెట్‌Team India T20 World Cup Trophy: Team india గెలిచినా టీ 20 వరల్డ్...

Team India T20 World Cup Trophy: Team india గెలిచినా టీ 20 వరల్డ్ కప్ ఇవ్వరు గాక ఇవ్వరు. ఇదేం ట్విస్ట్ రా అయ్యా

Team India T20 World Cup Trophy: టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. తద్వారా పొట్టి ఫార్మాట్ లో అద్భుతమైన చరిత్ర సృష్టించింది. అంతటి ఆస్ట్రేలియా.. బలమైన ఇంగ్లాండ్.. బీభత్సమైన దక్షిణాఫ్రికా.. వీరోచితమైన వెస్టిండీస్.. సంచలన న్యూజిలాండ్.. జట్ల వల్ల కానిది టీమిండియా చేసి చూపించింది. వరుసగా రెండుసార్లు టి20 వరల్డ్ కప్ అందుకున్న టీం ఇండియా.. మొత్తంగా మూడవసారి పొట్టి ఫార్మాట్లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్ల మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

టీమిండియా టి20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన నేపథ్యంలో ట్రోఫీ ఇచ్చారు. ఐసీసీ అధ్యక్షుడు జైశా చేతుల మీదుగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆ ట్రోఫీని స్వీకరించారు. అయితే ఆ ట్రోఫీ నిజమైనది కాదు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా మెగా టోర్నీ నిర్వహించినప్పుడు.. అందులో విజేతగా నిలిచిన జట్టుకు నిజమైన ట్రోఫీ ఇవ్వరు. నిజమైన ట్రోఫీ ఐసీసీ ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణలో ఉంటుంది. ఇలా ఉండడం వెనుక ఒక కారణం ఉంది.. నిజమైన ట్రోఫీ విలువను ఐసీసీ పర్యవేక్షించడానికి.. దాని విలువను భావితరాలకు చెప్పడానికి ఆ ట్రోఫీని తన వద్దే ఉంచుకుంటుంది. ఒరిజినల్ దానిని పోలివున్న ట్రోఫీని ఐసీసీ గెలిచిన జట్టుకు అందిస్తుంది.

కేవలం టి20 వరల్డ్ కప్ విషయంలోనే కాకుండా.. అన్ని మేజర్ టోర్నీ లలో ఐసీసీ ఇదే తరహా నిబంధనలు పాటిస్తూ ఉంటుంది. మేజర్ టోర్నీలలో రూపొందించే ట్రోఫీలలో ఐసిసి ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ ఉంటుంది. టి20 వరల్డ్ కప్ విషయానికే వస్తే వెండి పూతతో.. ఖరీదైన ఖనిజాలతో ఈ ట్రోఫీని ఐసీసీ రూపొందించింది. దీనికి రేడియం కోటింగ్ కూడా వేసింది. దీని విలువ కోట్లలో ఉంటుంది అంటారు. 2007 ప్రారంభ ఎడిషన్ లో టి20 బరువు 12 కిలోల వరకు ఉండేది. అయితే దీనిని ప్లేయర్లు పట్టుకోవడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో 2021 నుంచి ట్రోఫీని పూర్తిగా మార్చేసింది. దాని బరువును 3.9 కిలోలకు తగ్గించింది.. టి20 వరల్డ్ కప్ ను అమిత్ బాబూలాల్ రూపొందించారు. ఈయన మన దేశానికి చెందిన స్వర్ణకారుడు. థామస్ లైట్ అనే అంతర్జాతీయ వెండి స్వర్ణకారుడు ఈ ట్రోఫీకి మరిన్ని హంగులు అద్దారు.

వన్డే వరల్డ్ కప్ లో మాత్రం ఐసిసి సిల్వర్ ప్లేటేడ్ ట్రోఫీ కాకుండా.. గోల్డ్ ప్లేటెడ్ ట్రోఫీని అందిస్తూ ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సిల్వర్ ప్లేటెడ్ ట్రోఫీని అందిస్తూ ఉంటుంది. టి20 వరల్డ్ కప్ విషయంలో కూడా గోల్డ్ ప్లేటెడ్ ట్రోఫీ ఇవ్వాలి అనుకున్నారు. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ మధ్య భేదం ఉండాలని.. సిల్వర్ ప్లేటెడ్ ట్రోఫీని రూపొందించి.. విజేతకు అందిస్తూ వస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular