Team India selection : ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టులు వాడే భారత జట్టును శనివారం ప్రకటించారు. గిల్ కు జట్టును నడిపించే బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత స్థానాన్ని రిషబ్ పంత్ కు కట్టబెట్టారు. ఇది ఊహించిందే అయినప్పటికీ.. కొందరి ప్లేయర్ల విషయంలో సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది.. ముఖ్యంగా కొంతమంది ప్లేయర్ల విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ నడుచుకున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది.
మేనేజ్మెంట్ ప్రకటించిన జట్టులో అయ్యర్ కు చోటు లభించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాస్తవానికి అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో భారాన్ని మోసాడు. కి ప్లేయర్లు మొత్తం విఫలమవుతున్నచోట అతడు నిలబడి భారత జట్టుకు మెరుగైన స్కోర్ మాత్రమే కాకుండా.. దగ్గరుండి గెలిపించాడు. అయితే అటువంటి ఆటగాడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టడం విశేషం. ” అన్ని స్థానాలలో ప్లేయర్లు నిండిపోయారు. అందువల్లే అతడికి అవకాశం కల్పించలేదు. కాకపోతే అతడి సేవలను వినియోగించుకుంటామని” జట్టు మేనేజ్మెంట్ వ్యాఖ్యానించడం విశేషం.
Also Read : ఒక్కో బంతికి అరవై లక్షలు.. ఐపీఎల్ లో ఇతడి రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు!
ఇక వర్ధమాన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ జట్టు మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు విమర్శలుగా కారణమవుతోంది. వాస్తవానికి అతడు డొమెస్టిక్ క్రికెట్ బాగానే ఆడుతున్నాడు. పరుగులు కూడా భారీగానే సాధిస్తున్నాడు . కివీస్ తో జరిగిన సిరీస్ లో సెంచరీ కొట్టి ఆకట్టుకున్నాడు. అటువంటి ఆటగాడికి జట్టులో చోటు కల్పించలేదు. ఇక ఇటీవల కంగారులతో జరిగిన బి జి టి సిరీస్లో అతడు రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ ద్వారా ఎలాగైనా అవకాశం లభిస్తుందని భావించిన అతడు బరువు కూడా దారుణంగా తగ్గాడు. కానీ అతడిని మేనేజ్మెంట్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం.
ఇక మహమ్మద్ షమీ కి ఇంగ్లీష్ జట్టు పై మెరుగైన రికార్డు ఉంది. పైగా అతడు పేస్ పిచ్ లపై అదరగొడతాడు. అటువంటి ప్లేయర్ ను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. పైగా అతడు ఫామ్ లో లేడని సాకులు చెబుతోంది. 2023లో మన దేశం వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో షమీ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ప్రతి మ్యాచ్ లోను అతడు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో అంతగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. పేస్ పిచ్ లపై తన సామర్థ్యాన్ని నిరూపించుకునే సత్తా షమీకి ఉంది. కానీ అతడిని ఫామ్ లో లేడని పక్కన పెట్టడం విశేషం..” అతడు తన సామర్థ్యాన్ని కోల్పోయాడు. లయకు దూరంగా జరిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని ఎంపిక చేయలేం. అతడు పూర్వపు ఫాం అందుకుంటే కచ్చితంగా జట్టులో ఉంటాడని” మేనేజ్మెంట్ వ్యాఖ్యానించడం విశేషం. వాస్తవానికి సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం ఉన్న ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వాటిని మేనేజ్మెంట్ లెక్కలోకి తీసుకోలేకపోవడం విమర్శలకు ఆస్కారం కల్పిస్తోంది.