Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)…శివ (Shiva) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన తర్వాత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ చేస్తూ తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం రాజమౌళి వరుస సక్సెస్ లను సాధిస్తుండడం వల్ల రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ సైతం రాజమౌళిని పొగుడుతూ కొన్ని మాటలైతే చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ప్రపంచ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుంది. ఈ సినిమాతో రాజమౌళి టాప్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచం నలుమూలలా తెలుస్తోంది అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తుంది. నిజానికి ‘త్రిబుల్ ఆర్’ సినిమాకి రావాల్సినంత గుర్తింపు రాలేదని పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా మన గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తోంది అంటూ ఆయన చెప్పాడు.
Also Read : రాజమౌళిలోని ఆ గొప్పతనం బయటపెట్టిన మోడీ…
మరి ఏది ఏమైనా కూడా ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ తో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ లాంటి సంచలన దర్శకుడు ఇలాంటి మాట చెప్పడంతో అటు మహేష్ బాబు అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ తొందర్లోనే రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
మరి ఈ సినిమాతో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక కీలకమైన సన్నివేశాలను రెండో షెడ్యూల్లో చిత్రీకరించడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఏ చిన్న నిర్లక్ష్యం వహించినా కూడా సినిమాకు భారీగా డామేజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది…