Natarajan IPL 2025: ఇక యాజమాన్యాలు కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లలో కొంతమంది రిజర్వ్ బెంచ్ కే పరిమితం అవుతున్నారు. అటు బౌలింగ్ చేసే అవకాశం రాక.. ఇటు బ్యాటింగ్ చేసే సందర్భం లేక.. గోర్లు గిల్లుకుంటూ.. మ్యాచ్ చూస్తూ కాలం గడిపిస్తున్నారు. అలాంటి వారిలో ఢిల్లీ జట్టు స్టార్ ప్లేయర్ నటరాజన్ ఒకడు. గతంలో ఇతడు హైదరాబాద్ జట్టుకు ఆడేవాడు. ఇప్పుడు అతడు ఢిల్లీ జట్టు తరఫున ఆటగాడిగా మారిపోయాడు. గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో అతడిని 10.75 కోట్లకు ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. ఎంతో అద్భుతమైన బౌలింగ్ వేసే నైపుణ్యం ఉందన్న నటరాజన్ ను కీలక బౌలర్గా ఢిల్లీ జట్టు ఉపయోగించుకుంటుందని అందరు అనుకున్నారు. పైగా చివరి ఓవర్లలో నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. అందువల్లే అతడిని ఢిల్లీ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఆయుధం లాగా నటరాజన్ ఉపయోగపడతాడని అందరూ అనుకున్నారు. కానీ నటరాజన్ సేవలను ఢిల్లీ జట్టు ఉపయోగించుకోలేకపోయింది. ఇటీవల గుజరాత్తో తలపడిన సందర్భంలో నటరాజన్ కు అవకాశం ఇస్తే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అతడిని వినియోగించుకోవడంలో కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. అతని ప్రతిభను గుర్తించడంలో కూడా ఫెయిల్ అయ్యాడు.
నటరాజన్ కు కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే ఆడే అవకాశాన్ని ఢిల్లీ యాజమాన్యం కల్పించింది. వాటిల్లో అతడు కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. అంటే ఈ లెక్కన అతడికి బంతికి 60 లక్షల చొప్పున దక్కినట్టు తెలుస్తోంది. మెగా వేలంలో నటరాజన్ ను ఢిల్లీ యాజమాన్యం 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.. 14 మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే నటరాజన్ ఆడాడు. అందులో 18 బంతులు మాత్రమే వేశాడు. అతడిని10.75 కోట్లకు ఢిల్లీ యాజమాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో.. వాటిని 18 బంతులతో భాగాహారం చేస్తే ఒక్కో బతికి 60 లక్షల దాకా ముట్టినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ జట్టు ఈ సీజన్లో అద్భుతమైన విజయాలు సాధించింది. ఒకానొక దశలో ప్లే ఆఫ్ దాకా వెళుతుందని అనిపించింది. కీలక దశలో గుజరాత్ తో తలపడిన సందర్భంలో ఓటమి పాలయింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది. ఆ మ్యాచ్లో కనుక ఢిల్లీ జట్టు మెరుగైన బౌలర్లతో రంగంలోకి దిగి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్లే ఆఫ్ వెళ్ళేది. కానీ వచ్చిన అవకాశాలను ఢిల్లీ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఫలితంగా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించారు. ” ఢిల్లీ జట్టులో మెరుగైన బౌలర్లు ఉన్నారు. కానీ వారిని ఉపయోగించుకోవడంలో మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది.. అందువల్లే ఈ ఓటములు ఎదుర్కొంది. వచ్చే సీజన్లో అయినా ఢిల్లీ జట్టు ఈ ఓటమి నుంచి మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నామని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.