HomeతెలంగాణBRS Party : కవిత తిరుగుబాటుతో బీఆర్‌ఎస్‌ కు ఎంత నష్టం?

BRS Party : కవిత తిరుగుబాటుతో బీఆర్‌ఎస్‌ కు ఎంత నష్టం?

BRS Party  : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌)కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణలో ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది. అంతర్గత సంక్షోభాన్ని బయటపెట్టింది. 2025 మే 2న రాసిన ఈ లేఖ, కవిత యూఎస్‌లో ఉన్న సమయంలో మీడియాకు లీక్‌ అయింది. కవిత లేఖలో కేసీఆర్‌ నాయకత్వ శైలి, బీజేపీపై మృదుస్వభావ వైఖరి, పార్టీ నాయకులకు అందుబాటు లేకపోవడం, సిల్వర్‌ జూబ్లీ సభలో తెలంగాణ ఉద్యమ నాయకులను పట్టించుకోకపోవడం వంటి అంశాలను నెగెటివ్‌గా ప్రస్తావించారు. ఈ ఆరోపణలు బీఆర్‌ఎస్‌ ఐక్యతను దెబ్బతీసి, కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉంది.

నాయకత్వ సంక్షోభం
2023 శాసనసభ ఎన్నికల్లో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం, ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం పార్టీని బలహీనపరిచాయి. కవిత లేఖ వివాదం ఈ బలహీనతను మరింత తీవ్రతరం చేసింది. ఆమె బీజేపీపై కేసీఆర్‌ తీవ్రంగా విమర్శించలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా సహకరించారని ఆరోపించడం, బీఆర్‌ఎస్‌ కేడర్‌లో గందరగోళం సృష్టించింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీలు బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రచారం చేయడానికి వీలు కల్పించాయి. కవిత, హరీష్‌ రావు, కేటీఆర్‌ మధ్య విభేదాలు బయటపడటంతో, పార్టీ నాయకత్వంలో సంక్షోభం తలెత్తింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని, బీఆర్‌ఎస్‌లో చీలిక రావొచ్చని హెచ్చరించారు, ఇది పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది.

Also Read : కేసీఆర్‌ చుట్టూ ‘దెయ్యాలు’.. మరి తరిమేదెవరు కవితక్క?

కేటీఆర్‌ను వారసుడిగా..
బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ తన వారసుడిగా ప్రకటించారు. ఇది కవిత, హారీశ్‌రావుకు మింగుడు పడలేదు. అయితే హరీశ్‌రావు ఈ విషయంలో బయట పడలేదు. కానీ, కవిత బయట పడ్డారు. కేటీఆర్‌తో సమానంగా ఉండాల్సిన తనను పక్కన పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు పాజిటివ్, నెగెటివ్‌ అని లేఖ రాశారు. ఇదే సమయంలో హరీశ్‌రావు పార్టీ మారతారని ప్రచారం మొదలైంది. దీంతో అలర్ట్‌ అయిన కేటీఆర్‌ స్వయంగా హరీశ్‌రావు ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. తర్వాత హరీశ్‌రావు కేటీఈఆర్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. బావ, బావ మరుదులు ఒక్కటైన విషయం గమనించిన కవిత.. తన తండ్రికి రాసిన లేఖను కావాలనే మీడియాకు లీక్‌ చేసినట్లు చర్చ జరుగుతోంది.

హరీశ్‌కు లాభం..
పార్టీలో సంఖోభం తలెత్తిన ప్రతీసారి.. హరీశ్‌రావుకు లాభం జరుగుతోంది. కేసీఆర్‌ చాలాసార్లు హరీశ్‌ను పక్కన పెట్టాలని భావించారు. కానీ, అలా అనుకున్న ప్రతీసారి ఏదో ఒక పరిణామం హరీశ్‌కు అనుకూలంగా మారుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ సమయంలో ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. కానీ, తర్వాత పరిణామాలు ఆయనకు అనుకూలంగా మారాయి. తాజాగా మరోమారు పక్కన పెట్టేందుకు కేటీఆర్‌ను వారసుడిగా ప్రకటించారు. ఈ సమయంలో కవిత లేఖ ఇప్పుడు హరీశ్‌కు ప్లస్‌ అయింది.

చీల్చే అవకాశం లేదు..
ఇక బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఈతరుణంలో అందరూ ఒక్కటిగా అధికార పక్షంపై, ప్రజాసమస్యలపై పోరాడాలి. కానీ, కవిత తన ఉనికి కోసం పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడే నేతలకు గుర్తింపు, ఆదారణ లభిస్తుంది. కానీ స్వప్రయోజనాల కోసం చేసే పోరాటాలను క్యాడర్‌ కూడా పెద్దగా పట్టించుకోదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆమె అమెరికా నుంచి వచ్చిన సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరూ ఎయిర్‌ పోర్టుకు వెళ్లలేదు. ఇక బతుకమ్మ ఆటను కూడా కవిత తగ్గించారు. పరోక్షంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆమెకు చెక్‌ పెట్టె ప్రయత్నంలో భాగంగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కవిత పార్టీని చీల్చినా ఆమెకు పెద్దగా ప్రయోజనం, పార్టీకి నష్టం ఉండదు.

పునర్నిర్మాణ అవసరం
కవిత లేఖ వివాదం బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, కవిత ఆరోపణలు పార్టీ కేడర్‌లో నీరసాన్ని కలిగించాయి. కేసీఆర్‌ అందుబాటులో లేకపోవడం, పార్టీ నాయకులను పట్టించుకోకపోవడంపై కవిత విమర్శలు, కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచాయి. 2024 డిసెంబర్‌లో తెలంగాణ తల్లి విగ్రహ వివాదంలో కవిత చురుకైన పాత్ర పోషించినప్పటికీ, ఆమె లేఖ పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసింది. బీఆర్‌ఎస్‌ ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే, కేసీఆర్‌ నాయకత్వంలో సంస్కరణలు, అంతర్గత చర్చలు, కేడర్‌ ఐక్యతపై దృష్టి సారించాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ వివాదం ప్రభావం చూపితే, బీఆర్‌ఎస్‌ మరింత రాజకీయ

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular