https://oktelugu.com/

IND vs NZ 3rd Test : శాంట్నర్ పోయి.. అజాజ్ వచ్చే.. టీమిండియా కు ఈ దరిద్రం ఏంట్రా బాబూ!

బెంగళూరు మైదానాన్ని పేస్ కు అనుకూలంగా మలిచితే.. ఆ పిచ్ పై బ్యాటింగ్ చేయలేక భారత క్రికెటర్లు చేతులెత్తేశారు. పూణే మైదానాన్ని స్పిన్ కు అనుకూలించేలా రూపొందిస్తే.. ఈ మైదానంపై కూడా భారత ఆటగాళ్లు విఫలమయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2024 10:29 pm
    Santner-and-Ajaz-Patel

    Santner-and-Ajaz-Patel

    Follow us on

    IND vs NZ 3rd Test :తొలి టెస్ట్ లో హెన్రీ 8 వికెట్లు పడగొట్టాడు. ఓరూర్కే ఏడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. వీరిద్దరు కూడా పేస్ బౌలర్లే. ఇక రెండో టెస్టులో సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టాడు. సాంట్నర్ స్పిన్ బౌలింగ్ వేస్తాడు. మొత్తంగా పేస్, స్పిన్ బౌలర్లతో టీమిండియా పై న్యూజిలాండ్ సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే శుక్రవారం ముంబై వేదికగా ప్రారంభమైన మూడవ టెస్టులో సాంట్నర్ కు న్యూజిలాండ్ జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడు లేడు కాబట్టి, న్యూజిలాండ్ బౌలింగ్ ను స్వేచ్ఛగా ఎదుర్కోవచ్చని టీమ్ ఇండియా భావించింది. సగటు భారతీయ అభిమాని కూడా అదే ఆశించాడు. కానీ సాంట్నర్ వెళ్తూ వెళ్తూ తన బాధ్యతను అజాజ్ పటేల్ కు అప్పగించాడు. దీంతో అతడు సాంట్నర్ లేని లోటును తీర్చుతున్నాడు. 30 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న యశస్వి జైస్వాల్ అజాజ్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నైట్ వాచ్ మన్ మహమ్మద్ సిరాజ్ ను క్రికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా రెండు వికెట్లను తన సొంతం చేసుకున్నాడు. ఇక మరోవైపు హెన్రీ కూడా తన బాధ్యతను నిర్వర్తించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఊరించే బంతివేసి బోల్తా కొట్టించాడు. ప్రమాదకరమైన విరాట్ కోహ్లీని అద్భుతమైన త్రో తో రన్ ఔట్ చేశాడు. దీంతో కోహ్లీ నిరాశతో మైదానాన్ని వీడాడు.

    అజాజ్ పటేల్ ఫుల్ స్వింగ్

    ముంబై మైదానం క్రమేపి స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తోంది. అజాజ్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టడమే ఎందుకు నిదర్శనం. సాంటర్న్ కు విశ్రాంతి ఇచ్చి అజాజ్ పటేల్ కు అవకాశం ఇచ్చిందంటేనే.. అతడి మీద న్యూజిలాండ్ జట్టు ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడు కూడా మెరుగ్గానే బౌలింగ్ వేస్తున్నాడు. ఇప్పటికే కీలకమైన రెండు వికెట్లను తన సొంతం చేసుకున్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే శనివారం అతడు మరింత చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే టీమిండియా మరో ఓటమిని మూట కట్టుకోవాల్సి ఉంటుంది. 2000 సంవత్సరం తర్వాత టీమిండియా స్వదేశంలో వైట్ వాష్ కు గురి కాలేదు.. అయితే ముంబై టెస్ట్ కూడా గెలిచి టీమిండియాను వైట్ వాష్ చేయాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. టీమిండియాను స్వదేశంలోనే స్పిన్ బౌలింగ్ తో దెబ్బ కొట్టాలని అనుకుంటున్నది. ఈ క్రమంలోనే స్పిన్ బౌలర్లతో భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతోంది. పూణే టెస్టులో న్యూజిలాండ్ ఇదే ప్రయోగం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది.