https://oktelugu.com/

IND vs NZ 3rd Test : ఒకప్పుడు స్పిన్ ఉద్దండులు.. ఇప్పుడు కుక్కిన పేనులు.. టీమిండియా ఎందుకిలా అయ్యింది?

ప్రపంచానికి ఇంగ్లాండ్ క్రికెట్ ను పరిచయం చేసి ఉండవచ్చు. కానీ ఆ క్రికెట్లో స్పిన్ బౌలింగ్ లో వైవిధ్యాన్ని మాత్రం భారత జట్టే ప్రపంచానికి రుచి చూపించింది. అందువల్లే అప్పటినుంచి ఇప్పటివరకు టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ వేయడంలో.. దానిని ఎదుర్కోవడంలో సిద్ధహస్తులుగా మారారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తారు మారయింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2024 10:33 pm

    IND vs NZ 3rd Test

    Follow us on

    IND vs NZ 3rd Test : ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. శ్రీలంక బౌలర్లు వేసిన మాయాజాలమైన బంతులు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఫలితంగా శ్రీలంక జట్టు భారత్ పై వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో మన ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పూణే మైదానంలో జరిగిన రెండవ టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి స్పిన్ బౌలింగ్ ను భారత ఆటగాళ్లు అత్యంత దీటుగా ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం టీ 20 క్రికెట్ ఆడటం ఎక్కువ కావడంతో.. మనవాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదురు నిలబడలేక పోతున్నారు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కో లేకపోవడం వల్ల టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ బెర్త్ కే ప్రమాదం ముంచుకు వచ్చే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, సక్లైన్ ముస్తాక్, డానియల్ వెటోరి వంటి వారిని సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు ధాటిగా ఎదుర్కొనేవారు. ప్రపంచంలోనే మిగతా జట్లపై పై బౌలర్లు అద్భుతమైన రికార్డులు సాధించినప్పటికీ.. టీమిండియా కు వచ్చేసరికి వారు ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయేవారు. ఇప్పుడు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ.. స్పిన్ బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. స్పిన్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ పేక మేడ లాగా కూలిపోతున్నది.

    స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కో లేకపోవడానికి కారణాలు ఎన్నో..

    భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 2016-20 కాలంలో భారత జట్టులో టాప్ ఏడుగురు ఆటగాళ్లు సగటున 63 రన్స్ మాత్రమే చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు అది పడిపోతూ వస్తోంది.. చివరికి 37 పరుగులకు చేరుకుంది. అప్పట్లో విరాట్ కోహ్లీ, పూజార వంటి వారు స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేవారు. 2021 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాట్ కోహ్లీ 19, రోహిత్ 19, జైస్వాల్ 8, గిల్ 14, రాహుల్ 7 సార్లు స్పిన్నర్ల చేతిలో అవుట్ అయ్యారు. అయితే ఐపీఎల్ వల్ల న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్లు భారత్ లోకి వస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. అయితే వారిపై ఆడిన మన ఆటగాళ్లు మాత్రం ప్రతి విషయాన్ని సులభంగా తీసుకుంటున్నారు. శ్రీలంక జట్టుకు చెందిన దునిత్ వెల్లలాగే వంటి స్పిన్ బౌలర్ కూడా మన జట్టు ఆటగాళ్ళను ఒక ఆట ఆడుకుంటున్నాడంటే.. దానికి ప్రధాన కారణం అదే. ఇతర దేశాల నుంచి వచ్చిన బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తుంటే.. వారిని ఎదుర్కోవడంలో మన ఆటగాళ్లు పూర్తిగా విఫలమవుతున్నారు. అందువల్లే గల్లి స్థాయి ఆటగాళ్లలాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అంతిమంగా వికెట్లు కోల్పోయి పరువు తీసుకుంటున్నారు.