https://oktelugu.com/

ప్రక్షాళన: పూజారా, జడేజా ఔట్: రాహుల్, విహార్ ఇన్

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియాపై ఇప్పుడు విమర్శల వాన కురుస్తోంది. టీంను ప్రక్షాళన చేయాలని.. విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీ సైతం జట్టులో సమూల మార్పులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా టెస్టుల్లో 3వ స్థానంలో దిగి జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్న చెతేశ్వర్ పూజారాపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు గత ఫైనల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2021 5:20 pm
    Follow us on

    ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియాపై ఇప్పుడు విమర్శల వాన కురుస్తోంది. టీంను ప్రక్షాళన చేయాలని.. విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లీ సైతం జట్టులో సమూల మార్పులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

    ప్రధానంగా టెస్టుల్లో 3వ స్థానంలో దిగి జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్న చెతేశ్వర్ పూజారాపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు గత ఫైనల్ లో 40 బంతులు ఎదుర్కొని కానీ పరుగులు చేయలేకపోయాడు. అతడిని పక్కకు తప్పించి మూడో స్థానంలో కోహ్లీ రావాలని.. పరుగులు చేసి మిగతా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తగ్గించాలని మేనేజ్ మెంట్ డిసైడ్ అయినట్టుగా సమాచారం.

    ఇక బ్యాటింగ్ లోతు పెంచాలని స్పిన్నర్ రవీంద్రజడేజాను పక్కనపెట్టి స్పెషలిస్ట్ బౌలర్ గా అయితే సిరాజ్ లేదంటే శార్ధుల్ ఠాకూర్ లను తీసుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ డిసైడ్ అయ్యింది. ఇక బ్యాటింగ్ లోనూ పూజారా, జడేజాను, వరుసగా విఫలం అవుతున్న శుభ్ మన్ గిల్ ను పక్కనపెట్టి కేఎల్ రాహుల్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లను తీసుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

    ఇక సీనియర్ పేసర్ ఈషాంత్ గాయంతో దూరం కావడంతో సిరాజ్ కు చోటు ఖాయంగా ఉంది. ఇక స్వింగ్ బౌలర్ శార్ధుల్ ను తీసుకుంటే బ్యాటింగ్ లోనూ అతడు లోటు భర్తీ చేస్తాడని మేనేజ్ మెంట్ భావిస్తోంది.మొత్తంగా టీమిండియా ప్రక్షాళన దిశగా ఆలోచిస్తోందని తెలుస్తోంది.