తాజాగా హైపర్ ఆది వచ్చే వారం కోసం ఓ స్కిట్ చేశారు. అందులో ద్వంద్వార్థాలు వచ్చే విధంగా మాటలు ఉన్నాయంటూ బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆదిపై విమర్శల వెల్లువ వస్తోంది. జబర్దస్త్ ఎంట్రీకంటే ముందు హైపర్ ఆది సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తుండేవాడు. చిన్న వీడియోలు చేస్తున్న క్రమంలో అదిరే అభి దృష్టిలో పడడంతో మొదట స్క్రిప్ట్ రైటర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆది అనతి కాలంలోనే ఆర్టిస్ట్ గా టీం లీడర్ గా ఎదిగాడు.
జబర్దస్త్ అంటే ఆది అనే స్థాయికి చేరుకున్నాడు. తనదైన టైమింగ్ తో పంచ్ ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆది కోసమే జబర్దస్త్ చూసే వారున్నారంటే అతిశయోక్తి కాదు. వచ్చే వారం ప్రసారమయ్యే స్కిట్ కోసం ఆది ఓ సన్నివేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భార్య కడుపు పండాలని అనగానే గోరింటాకు పెట్టుకో అని సెటైర్ వేస్తాడు.
తర్వాత ఆమె మాట్టాడుతూ ఏమైందండీ ఏమైనా లోపమా అంటే ఏమీ చేయకపోతే లోపం అంటారు. ఏదైనా చేస్తే స్కిట్ కోసం పిలిచి ఇలా చేస్తావా అంటారని పంచ్ వేస్తాడు. దీంతో యాంకర్ అనసూయ కల్పించుకుని స్కిట్ కోసం వచ్చిన అమ్మాయిలతో అందరితో చేసేశావా అంటుంది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైపర్ ఆది, అనసూయ మాటలపై ప్రేక్షకుల్లో ఆగ్రహం వస్తోంది.