అయితే ఆయన తలకు, ముక్కుకు బలమైన గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తరువాత నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముక్కుకు ఆపరేషన్ చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత రకరకాల విధాలుగా కామెంట్లు చేశారు. మహేశ్ కు జరిగిన ప్రమాదంపై దూషణలతో కూడిన వ్యాఖ్యలు పెడుతున్నారు.
ఆయనకు జరిగిన ప్రమాదానికి దేవుడు వేసిన శిక్ష అని సెలవిస్తున్నారు. అయితే ఆయన ప్రాణాలకేమి ప్రమాదం లేదని కాని బతికున్నంత కాలం ఇబ్బందులు పడతారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆయనకు కీడు జరగాలని కోరుకోవడం మంచిది కాదన్నారు. జరిగిన ప్రమాదంపై అనవసర పోస్టులు పెట్టకూడదని సూచిస్తున్నారు.
ఆయన స్నేహితులు మాత్రం ప్రమాదం ఆరా తీస్తూ తాము భరోసాగా ఉన్నామని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నం వరకు ఎలాంటి స్పష్టత లేదు. స్వల్ప గాయాలయ్యాయని కొందరు చెబుతుండగా ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయని చెబుతున్నారు. ముక్కుకు ఆపరేషన్ పూర్తయిందని, ఇతర ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. ఆయన హెల్త్ గురించి బులెటిన్ విడుదల చేయకపోవడంతో ఇంకా పుకార్లు వస్తున్నాయి.