spot_img
Homeక్రీడలుTeam India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో అవకాశం వచ్చింది అంటే ఆటగాళ్లు ఖచ్చితంగా తమను తాము నిరూపించుకోవాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే కలబడి నిలబడాలి.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలింగ్లో నిరూపించుకోవాలి. ఫీల్డింగ్లో మెరుపుతీగ లాగా కదలాలి. అప్పుడే జట్టులో స్థానం స్థిరంగా ఉంటుంది.

ఈ విషయాన్ని ఈ ఆటగాళ్లు మర్చిపోయారు. కనీసం తాము జట్టులోకి ఎందుకు వచ్చాము.. ఇలా ఆడుతున్నాము అనే విషయాన్ని విస్మరించారు. బంగారు పళ్లెంలో దర్జాగా అవకాశాలు ఇస్తే.. దారుణంగా కింద పడేసుకున్నారు. తమకు వచ్చిన అవకాశాలను గోదారిలో పడేసుకున్నారు. దీంతో కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటిస్తారు అనుకుంటున్న సందర్భంలో.. ఈ ప్లేయర్ల ఆట తీరు ఇంత దారుణంగా ఉండడంతో.. అసలు వాళ్లకు వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవలి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లలో కొంతమంది ఆటగాళ్లు ఆడిన తీరు చూస్తే చాలా చండాలంగా ఉంది. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కిషన్, వాషింగ్టన్ సుందర్, శివం దుబే వంటి ప్లేయర్లు విఫలమయ్యారు. బ్యాటింగ్లో సత్తా చూపించలేకపోయారు. బౌలింగ్లు అదరగొట్టలేకపోయారు. ఫీల్డింగ్ లో కూడా నాశరకమైన ప్రదర్శన చేశారు. దీంతో ఈ ముగ్గురికి వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. దుబే టి20లలో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వన్డే ఫార్మేట్లో గోల్డెన్ డక్ గా వెనక్కి వెళ్ళిపోతున్నాడు.

వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా అదే. అతడు కేవలం రెండు ఇన్నింగ్స్ లలో 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇషాన్ కూడా తన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసుకున్నాడు. ప్రిన్స్ అనే బౌలర్ అయితే ఏకంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 10 ఓవర్లు వేసి 79 పరుగులు ఇచ్చాడు. ఇలా ఈ ప్లేయర్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో.. కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. వీరికి గత రికార్డులు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం దారుణమైన స్థితిలో ఉన్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఆడతారు.. ఏం చేస్తారు.. అనే దానిమీదనే వీళ్ళ కెరియర్ ఆధారపడి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవికి కూటమి కీలక బాధ్యతలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది....

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Oktelugu Epaper
Exit mobile version