spot_img
Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తుందో మీరే చూడండి. శోభిత ని పెళ్లాడిన తర్వాత కేవలం నాగ చైతన్య కి మాత్రమే కాదు , అక్కినేని ఫ్యామిలీ కి మహర్దశ పట్టింది అనే చెప్పొచ్చు. వీళ్లిద్దరి పెళ్ళైన కొన్ని రోజులకే , నాగ చైతన్య నుండి విడుదలైన ‘తండేల్’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అక్కినేని కుటుంబానికి మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమా ఇది. ఇక ఆ తర్వాత అక్కినేని అఖిల్ కూడా రీసెంట్ గానే ‘లెనిన్ ‘ తో భారీ విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించాడు. ఇలా అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం అచ్చమైన స్థితిలో ఉంది.

ఇక శోభిత విషయానికి వస్తే పెళ్లి తర్వాత ఈమె సినిమాలు ఆపేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు , వరుసగా మూవీ , వెబ్ సిరీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా కాలాన్ని గడుపుతోంది. ఇలా వీళ్లిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు , ఖాళీ సమయం దొరికినప్పుడు వెకేషన్ టూర్స్ కి వెళ్తుంటారు. అలా చాలా సరదాగా, సుఖవంతంగా వీళ్ళ దాంపత్య జీవితం సాగుతోంది. అయితే రీసెంట్ గా నాగ చైతన్య పెట్టిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘పెళ్లి అయినా రెండేళ్ల తర్వాత నా భార్య నా కోసం వంట వండింది. బహుశా ఈరోజు నేను ఎదో గొప్ప పని చేశానని ఆమెకి అనిపించొచ్చు’ అని నాగ చైతన్య శోభిత చేతుల్లో ఉన్నటువంటి బౌల్స్ ని చూపిస్తూ పోస్ట్ పెట్టారు.

ఇది సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టిన నెటిజెన్స్ ఉన్నారు , అదే విధంగా నెగెటివ్ కామెంట్స్ పెట్టిన నెటిజెన్స్ కూడా ఉన్నారు. ‘తెలుగు అమ్మాయివి అయ్యుండి , పెళ్లి అయినా రెండేళ్ల వరకు వంట గది వైపు పోలేదా? మీ పని బాగుందే’ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుండగా , మరికొంతమంది మాత్రం ‘స్వీట్ కపుల్.. చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు , ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి’ అని అంటున్నారు. ఆ పోస్ట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం ‘వృష కర్మ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version