IND vs ENG: 54 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 250 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. ఇందులో 13 సిక్స్ లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా అతడు 135 పరుగులు చేశాడు. టి20లలో భారత జట్టు తరఫున ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. టీమిండియా తరఫున రోహిత్ శర్మ టి20 లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ 35 బంతులు ఎదుర్కొని సెంచరీ చేశాడు. ఇక టి20 లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) కొనసాగుతున్నాడు. అతడు కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో 17 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసి.. వేగవంతమైన అర్థ శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ రెండవ స్థానాన్ని ఆక్రమించాడు. టి20లలో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత రికార్డు అభిషేక్ శర్మదే. టీమిండియా తరఫున గత 16 ఇన్నింగ్స్ లలో అభిషేక్ శర్మకు ఇది 4+ అర్థ శతకం కావడం విశేషం. మొత్తంగా 188+ స్ట్రైక్ రేట్ తో అభిషేక్ శర్మ 450 పరుగులు చేశాడు.
విధ్వంసం
పవర్ ప్లే లో అభిషేక్ శర్మ విధ్వంసం ధాటికి తొలి ఆరు ఓవర్లలోనే టీమిండియా హైయెస్ట్ స్కోర్ చేసింది. మొదటి ఆరు ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసింది. పవర్ ప్లేలలో హైయెస్ట్ స్కోర్ రికార్డ్ టీమిండియా పేరు మీదనే ఉన్నది. 2021లో స్కాట్లాండ్ జట్టు పైన భారత్ రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది..
టి20 పవర్ ప్లే లో భారత్ అందించిన హైయెస్ట్ స్కోర్లు ఒకసారి పరిశీలిస్తే..
2025లో ఇంగ్లాండ్ జట్టుపై ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది. ఇది ఇప్పటివరకు హైయెస్ట్ రికార్డ్ గా ఉంది.
2021 లో స్కాట్లాండ్ జట్టుపై జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి భారత్ 82 పరుగులు చేసింది.
2024 లో బంగ్లాదేశ్ చెట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 82 పరుగులు చేసింది.. ఇది మూడవ హైయెస్ట్ స్కోర్ గా ఉంది.
2018లో సౌత్ ఆఫ్రికా పై భారత్ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఇది నాల్గవ హైయెస్ట్ రికార్డ్ గా ఉంది.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్ల నుంచి సపోర్ట్ లభించి ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడేమో.. మొత్తానికి అతడు 250 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.. అతడి ధాటికి ఏ ఇంగ్లాండ్ బౌలర్ కూడా నిలువలేకపోయాడు.. ఆర్చర్ నుంచి మొదలు పెడితే ఉడ్ వరకు అందరూ అతడి బాధితులుగా మిగిలిపోవడం విశేషం. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్.. 17.6 ఓవర్ వద్ద ఏడో వికెట్ గా అవుట్ అయ్యాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 237 పరుగులు.