Maruti Suzuki Ertiga : మారుతి సుజుకి ఎర్టిగా భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఫ్యామిలీ కారు అని కూడా అంటారు. ఈ కారు కొనాలనుకుంటే మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి ఎర్టిగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారును EMI లో ఎలా కొనుగోలు చేయవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఎర్టిగా ఆన్-రోడ్ ధర
మారుతి సుజుకి ఎర్టిగా CNG వేరియంట్ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.78 లక్షలు. అలాగే, ఇతర ఛార్జీలు వంటి రిజిస్ట్రేషన్ ఫీజు (రూ. 1,12,630), బీమా (రూ. 40,384), అదనపు ఛార్జీలు (రూ. 12,980) కలిపి, ఎర్టిగా యొక్క మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 12,43,994 అవుతుంది.
డౌన్ పేమెంట్, EMI వివరాలు
మీరు రూ. 12.43 లక్షల ఆన్-రోడ్ ధరపై రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మీరు మిగిలిన రూ.11,43,994 మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకోవాలి. ఈ లోన్‌పై 10శాతం వార్షిక వడ్డీ రేటుతో 60 నెలల EMI కింద ప్రతిభాగంగా రూ.24,306 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా, ఈ లోన్‌పై రూ.3,14,396 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్, ఫీచర్లు
ఎర్టిగా CNG వేరియంట్ కిలోకు దాదాపు 26.11 కి.మీ మైలేజీని ఇస్తుంది. కారు ఇంజిన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.ఇది 101.64 bhp శక్తి , 136.8 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 7 సీట్లు ఉన్నాయి. కంపెనీ ప్రకారం ఈ కారు 20.51 కి.మీ లీటరుకు మైలేజీ ఇస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ కారు మార్కెట్లో అత్యుత్తమ MPV లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ 7 సీట్ల కారులో 1462 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్షన్ ను పొందుతుంది.
మారుతి సుజుకి ఎర్టిగా అనేది ఒక సౌకర్యవంతమైన, కుటుంబానికి అనువైన కారుగా, మంచి మైలేజీతో వస్తుంది. EMI ద్వారా దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. చిన్న డౌన్ పేమెంట్‌తో ప్రారంభించి, అనుకూలమైన వాయిదా చెల్లింపు ద్వారా మీరు ఈ కారును సొంతం చేసుకోవచ్చు.