Team India New Squad : ఒక్క ఓటమి. ఒకే ఒక్క ఓటమి టీం ఇండియా కు చాలా గుణ పాఠమే నేర్పింది. కివీస్ పర్యటనకు ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కి భారత క్రికెట్ సమాఖ్య విశ్రాంతి ఇచ్చింది. నవంబరు 18 నుంచి ప్రారంభమయ్యే టీ20 లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, వన్డే ల్లో కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను నియమించింది. కివీస్ లో పిచ్ లన్నీ కూడా బౌన్సీ గా ఉంటాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల్లో ఉన్న పిచ్ లతో పోలి ఉంటాయి. బ్యాట్స్ మెన్ లకు మాత్రం స్వర్గధామంలా ఉండవు. సీమర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇక నవంబరు 18 నుంచి 22 వరకు 3 టీ20 మ్యాచ్ లను కివిస్ తో ఇండియా ఆడనుంది. మొదటి మ్యాచ్ నవంబర్ 18న వెల్డింగ్ టన్లో జరుగుతుంది. రెండో టి20 మ్యాచ్ నవంబర్ 20న బే ఓవల్ మౌంట్ మాంగ్ నూయి లో జరుగుతుంది. మూడవ టి20 మ్యాచ్ నవంబర్ 22 న నేపియర్ లోని మెక్ లిన్ పార్క్ లో జరుగుతుంది.

మొత్తం యువరక్తం
కివీస్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు భారత క్రికెట్ సమాఖ్య మొత్తం యువ ఆటగాళ్ళను ఎంపిక చేసింది.. హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ కీపర్ గా వ్యవహరించనున్నాడు. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు సాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్శ్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి వారిని ఎంపిక చేసింది. జట్టులో సీనియర్లకు దాదాపుగా విశ్రాంతి ఇచ్చింది. టి20 మెన్స్ వరల్డ్ కప్ లో సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుతో ఎదురైన పరాభవాన్ని గుర్తించి బిసిసిఐ పూర్తి ప్రక్షాళనకు దిగింది. ఎలాగైనా కివీస్ తో సీరిస్ నెగ్గాలని గట్టి పట్టుదలతో జుట్టు కూర్పు సిద్ధం చేసింది. యువతకు పూర్తి అవకాశం ఇచ్చింది. ఇందులో నిరూపించుకున్న వారే తదుపరి సిరీస్ లకు ఎంపిక అవుతారని సంకేతాలు ఇచ్చింది.
నవంబర్ 25 నుంచి వన్డేలు
టి2లు ముగిసిన తర్వాత నవంబర్ 25 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 25న ఆక్లాండ్ లోని ఈడెన్ పార్కులో మొదటి వన్డే జరుగుతుంది. రెండో వన్డే నవంబర్ 27న హామీల్టన్ లో జరుగుతుంది. మూడు వన్డే నవంబర్ 30న క్రైస్ట్ చర్చ్ లో జరుగుతుంది.
ఇదీ వన్డే జట్టు
శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్) హార్దిక్ పాండ్య, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు సాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, షాబాద్ అహ్మద్, కుల్దీప్ సీన్, అర్శ్ దీప్ సింగ్, దీపక్ చాహార్, ఉమ్రాన్ మాలిక్.
ఇక ఈ మూడు టి20 లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డే మ్యాచ్ లు ఉదయం 7 గంటల నుంచి మొదలవుతాయి. ఈ మ్యాచ్ లు డిడి స్పోర్ట్స్, అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.