Homeక్రీడలుక్రికెట్‌Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి టీమిండియా వెళ్ళాలి అంటే కచ్చితంగా ఇకపై జరిగే ప్రతి టెస్ట్ సిరీస్ లోనూ గెలవాలి. కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా పేరుపొందిన జట్ల మీద గెలవడం లేదు. కేవలం బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్ల మీద మాత్రమే విజయాలు సాధించింది. ఇది ఎంతో ఘన చరిత్ర ఉన్న టీమిండియాకు మకిలి లాంటిది. అయితే దీనిని శుభ్రం చేసుకోవడానికి మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టెస్ట్ ఫార్మాట్లో మార్పులు తీసుకురావాల్సిన అవకాశాలను పరిశీలిస్తోంది.

మేనేజ్మెంట్ ఆలోచన బాగానే ఉన్నాప్పటికీ.. దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే కష్టంగా మారింది.. ఎంత కాదనుకున్నా సరే ఇప్పటికి టీమిండియా టెస్ట్ ఫార్మాట్ బౌలింగ్ దళానికి ప్రధాన బలం బుమ్రా. కాలాలు మారుతున్నప్పటికీ.. కొత్త కొత్త ఆటగాళ్లు వస్తున్నప్పటికీ.. ఇంతవరకు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ను మేనేజ్మెంట్ తయారు చేయలేకపోయింది. సిరాజ్ కు ఆస్థాయి ఉన్నప్పటికీ అతని మీద వర్క్ లోడ్ పెరిగిపోతుంది. దీనికి తోడు మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రసిద్ధి.. ఆకాష్ దీప్.. వంటి వారు భవిష్యత్తు ఆశా దీపాలుగా కనిపించినప్పటికీ.. వారు స్థిరమైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దీనికి తోడు వరుస ఓటములు టీమిండియా టెస్ట్ సామర్థ్యాన్ని మొత్తం కుంగ దిశాయి.

ఇప్పుడిక టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళాలి అంటే జరిగే ప్రతి టెస్ట్ సిరీస్ కూడా గెలవాలి. అది జరగాలంటే జట్టులో బలం ఉండాలి. అయితే ఇప్పుడు అదే బలం లోపించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత జట్టుకు బౌలింగ్ బలం మొత్తం బుమ్రా మీద ఆధారపడి ఉంది. అయితే అతడు ప్రస్తుతం సామర్ధ్యలేమితో ఇబ్బంది పడుతున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకున్న మేనేజ్మెంట్.. అతని మీద ఒత్తిడి తీసుకురాకూడదని భావించింది. ఒకవేళ అదే గనుక జరిగితే తదుపరి శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఆడే అవకాశం లేదు. అదే గనక జరిగితే టీమిండియా కు గట్టి దెబ్బ. పైగా శ్రీలంక మైదానాలు పాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. కేవలం బుమ్రా మాత్రమే కాదు, వాషింగ్టన్ సుందర్ , ఆల్ రౌండర్ నితీష్, హర్షిత్ రాణా కూడా గాయాల బారిన పడ్డట్టు తెలుస్తోంది. వీ\రు కూడా శ్రీలంక సిరీస్లో ఆడే అవకాశం లేదని సమాచారం. ఇలా గాయపడ్డ సింహాలతో నెట్టుకొచ్చే బదులు.. కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అని అభిమానులు మేనేజ్మెంట్ కు సూచిస్తున్నారు. మరి వీళ్లను పక్కనపెట్టి.. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారా.. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తారా.. స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే శ్రీలంక మైదానాల మీద టీం ఇండియా మేనేజ్మెంట్ ఎటువంటి ప్రయోగాలు చేయబోతోంది.. ఈ ప్రశ్నలకు లభించే సమాధానం ఆధారంగానే టీమిండియా టెస్ట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper