Team India: వన్డే క్రికెట్‌లో వరల్డ్(World Cup) కప్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ కోసం ఆతిథ్య పాకిస్తాన్(Pakisthan)లో ఏర్పాట్లు జోరందుకున్నాయి. భారత్ మ్యాచ్‌లు దుబాయ్(Dubai)లో జరుగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని దేశాలు ఈ టోర్నీలో పాల్గొనే తమ స్కావడ్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ ప్రకటించింది. భారత జట్టు(Team India)కు సంబంధించిన ప్రకటన ఎప్పుడెపుపడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియాకు షాక్ తగిలింది.
కోలుకోని బూమ్రా..
టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియా(Australia) పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ఈ టోర్నీలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆస్ట్రేలియాలో గాయపడిన బూమ్రా(Bhumra) ఇంకా కోలుకోలేదు. గాయంతో బాధపడుతున్న మరో పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బూమ్రా విషయంలో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయన గ్రూప్ లెవల్ మ్యాచ్‌లు ఆడకపోవచ్చని తెలుస్తోంది.
కారణం ఇదే..
బూమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(Banglur National Cricket Acadamy)లో ఉంచి ట్రీట్‌మెంట్ చేయిస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్‌తోపాటు ఇతర ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బూమ్రా కోలుకుంటున్నాడు. అతడికి సర్జరీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ స్పీడ్‌స్టర్ ఎప్పటి వరకు పూర్తిగా రికవరీ అవుతాడు అనేది క్లారిటీ లేదు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించే జట్టు విషయంలో బీసీసీఐ తర్జనభర్జన పడుతోందని తెలిసింది. టోర్నీకి ముందు భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్‌తో టీమిండియా 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 జట్టులో బూమ్రాకు అవకాశం దక్కలేదు. షమీకి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికకు మరింత సమయం కావాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. బూమ్రా కోలుకోకుంటే ఎవరిని తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.