Team India ICC Losses: క్రికెట్లో ఏ ఫార్మాట్ లోనైనా విజయాన్ని టాస్ ప్రభావితం చేస్తుంది.. సాధ్యమైనంతవరకు టాస్ గెలవాలని ప్రతీ జట్టు కెప్టెన్ భావిస్తుంటాడు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడు. కెప్టెన్ తీసుకొనే ఆ నిర్ణయమే జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. అయితే టాస్ నెగ్గే విషయంలో టీమిండియా కెప్టెన్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలేమో.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాదిరిగా.. టీమిండియా ప్లేయర్లకు టాస్ నెగ్గే విషయంలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలేమో..
Also Read: పంత్ ప్లేస్ లో జగదీశన్.. అతడి రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?
టీమిండియాకు కెప్టెన్ మారినప్పటికీ.. టాస్ నెగ్గే విషయంలో మాత్రం గత ఫలితమే కనిపిస్తోంది.. ఇప్పటికే టాస్ వరుసగా ఓడిపోతూ చెత్త రికార్డు నమోదు చేసుకున్న టీమ్ ఇండియా.. ఆ ఘనతను మరింత మెరుగుపరుచుకుంది. అంతర్జాతీయ మ్యాచులలో టాస్ ఓడి.. అత్యధిక అంతర్జాతీయ మ్యాచులలో టాస్ ప్రక్రియను విజయవంతంగా దాటలేని జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా.. వరుసగా ఐదో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయింది. తద్వారా తన టాస్ ఓటముల సంఖ్యను 15కి పెంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టు కూడా ఈ స్థాయిలో ఇన్ని మ్యాచ్ లలో టాస్ ఓడిపోలేదు.
ఇంగ్లీష్ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా.. తొలి మ్యాచ్లో టాస్ ఓడిపోయి.. ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్లో ఓడిపోయింది. రెండవ టెస్టులోనూ టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్లో గెలిచింది. మూడవ టెస్టులో టాస్ ఓడిపోయి ఇండియా ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక నాలుగో టెస్టులో టాస్ ఓడిపోయాడు టీమిండియా.. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రతిభ చూపించి మ్యాచ్ ను డ్రా గా ముగించింది.
Also Read: నిజమైన దేశభక్తి అంటే మీదే.. నిజంగా ‘లెజెండ్స్’ అనిపించుకున్నారు
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 5వ టెస్టు కలుపుకొని టీమిండియా వరుసగా అయిదు టెస్ట్ లు, దానికంటే ముందు 8 వన్డేలు, రెండు టీ20 లలో టాస్ ఓడిపోయింది. ఈ ఏడాది జనవరిలో సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది. భారత టెస్ట్ జట్టు సారధిగా గిల్ కొనసాగుతున్నప్పటికీ.. అతడు కూడా వరుసగా ఐదు టెస్టులలో టాస్ ఓడిపోయి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి సిరీస్ లోనే అతడు వరుసగా ఐదు మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు.. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఐదు మ్యాచ్ల సిరీస్లో అన్నింట్లోనూ టాస్ లు ఓడిపోవడం ఇది 14వ సారి..