Which Eggs are Healthier: రోజుకో కోడిగుడ్డు తింటే ఎంతో ఆరోగ్యమని తెలుపుతూ ఉంటారు. పౌష్టికాహారంలో భాగంగా పిల్లలకు ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే గర్భిణీలకు కూడా ప్రతిరోజు కోడిగుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో నకిలీ కోడిగుడ్లు భయపెడుతున్నాయి. కొన్ని రకాల కోడిగుడ్లు కొని తెచ్చుకొని ఇంట్లో వేయడం వల్ల అవి నాసిరకంగా ఉన్నట్లు తేలుతుంది. అందువల్ల కోడిగుడ్లు నాణ్యమైనవా? లేవా? అనేది తెలుసుకొని ఇంటికి తీసుకొని రావాలి. అయితే చాలామందికి ఇలా ముందే తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత గుడ్డును ఒక పాత్రలో ఉన్న నీళ్లలో వేయడం ద్వారా ఇది బరువుగా ఉంటే స్వచ్ఛమైన కోడిగుడ్డు అని.. తేలికగా నీటిపై తేలి ఆడితే నకిలీ కోడి గుడ్డు అని గుర్తించుకోవాలి. అయితే కొందరు ఈమధ్య మార్కెట్లో దొరికే గోధుమ రంగు కోడిగుడ్లు నాణ్యమైనవి అని అంటున్నారు. మరి ఇది నిజమా?
Also Read: 40+ దాటితే ఇక ఏం చేయలేమా?
మార్కెట్లో రెండు రకాల కోడిగుడ్లు లభ్యం అవుతున్నాయి. ఒకటి తెల్లగా ఉండే కోడిగుడ్లు.. మరొకటి గోధుమ రంగులో ఉండే కోడిగుడ్లు. కొంతమంది అభిప్రాయం ప్రకారం గోధుమ రంగులో ఉండే కోడిగుడ్లు ఎక్కువగా శక్తిని ఇస్తాయని అంటుంటారు. అందుకే వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. కానీ మరికొందరు చెబుతున్న ప్రకారం ప్రతి కోడిగుడ్డులో ఒకే రకమైన పోషకాలు ఉంటాయని . అందువల్ల కోడిగుడ్లు నాణ్యమైనవా? లేవా? అనేది తెలుసుకోవాలి. రంగుని బట్టి డిసైడ్ కావద్దు అని అంటుంటారు.
మరి కోడిగుడ్లు గోధుమ రంగులో ఎందుకు ఉంటాయి అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది.. ఎరుపు లేదా ఇతర రంగులో ఉండే కోళ్లు గోధుమ రంగులో కోడిగుడ్లను పెడుతూ ఉంటాయి. కొందరు ఇలాంటి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు. వీటికి ఖరీదైన దానను అందిస్తూ ఉంటారు. ఖరీదైన దాన ఇవ్వడం వల్ల వాటికి ఎక్కువగా పోషకాలు ఉంటాయని చెబుతారు. కానీ అలాంటిది ఏమీ లేదని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గోధుమ రంగులో ఉండే కోడుగుడ్డు.. తెల్లని కోడిగుడ్డులో విటమిన్ A, D, B12 ఉంటాయి. రెండిటిలోనూ ఒకే రకమైన విటమిన్ లో ఉన్నప్పుడు పోషకాలలో ఎలా తేడా ఉంటాయని కొందరు ఆశిస్తూ ఉన్నారు. ఈ రెండు రకాల కోడిగుడ్లలో రంగు మాత్రమే తేడా ఉంటుందని.. పోషకాలలో ఏ విధమైన మార్పు ఉండదని చెబుతున్నారు.
Also Read: ధోని సొంత ఊరిలో.. అద్భుతమైన వంటకం.. తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు
అయితే పౌల్ట్రీ ఫామ్ లో పెరిగే కోళ్ల కంటే బయట తిరిగే కోళ్లు ఎక్కువగా సూర్యరష్మి లో ఉన్నందువలన వీటిలో శక్తి అదనంగా ఉంటుంది. దీంతో ఈ కోళ్లు పెట్టే కోడిగుడ్లు కాస్త ఎక్కువగా నాణ్యతను కలిగి ఉంటాయని తెలుపుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే గోధుమ రంగు గుడ్లు ఇలా సూర్యరష్మి ఎక్కువగా ఉండే వాళ్ళ ద్వారా వచ్చినయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొందరు కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఇలాంటి రంగు గుడ్లను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అందువల్ల మార్కెట్లో దొరికే కోడిగుడ్ల నాణ్యతను బట్టి మోసకాలను డిసైడ్ చేసుకోవాలని అంటున్నారు.