Narayan Jagadeesan Records: అండర్సన్ – టెండూల్కర్ సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ లండన్ ఓవల్ మైదానం వేదికగా గురువారం నుంచి ఐదో టెస్ట్ ఆడనున్నాయి. ఈ టెస్ట్ కు భారత జట్టు అనేక మార్పులు చేసింది. జట్టులో రిషబ్ పంత్ స్థానంలో జగదీశన్ ఆడబోతున్నాడు.. జగదీశన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నెట్స్ లో అతడు తీవ్రంగా సాధన చేస్తున్న తీరు ఆకట్టుకుంటున్నది.. గంటల తరబడి అతడు సాధన చేశాడని.. అతడిలో పట్టుదల కనిపిస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగదీశన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 52 మ్యాచులు ఆడాడు. 47.5 సగటుతో 3373 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు ఉన్నాయి. 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తుది జట్టులో జగదీశన్ ఆడటం ఖాయమని తెలుస్తోంది.
Also Read: కింగ్డమ్’ మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!
అండర్సన్ – టెండూల్కర్ సిరీస్లో రిషబ్ పంత్ మూడవ టెస్టులో గాయపడ్డాడు. అతడి చేతికి గాయం కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ ప్రభావం రెండవ ఇన్నింగ్స్ లో అతని బ్యాటింగ్ మీద పడింది. అతడు స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో.. అది టీమిండియా విజయాన్ని ప్రభావితం చేసింది. ఆ తర్వాత నాలుగో టెస్టులో రిషబ్ పంత్ కాలికి తీవ్రంగా గాయం అయింది. దీంతో అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. చికిత్స తర్వాత బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. అంతటి ఇబ్బందిలో కూడా జట్టుకు అవసరమైన పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం డ్రెస్సింగ్ రూమ్ కు పరిమితమయ్యాడు. దీంతో అతడు ఐదవ టెస్టు ఆడేది అనుమానమేనని వార్తలు వచ్చాయి. చివరికి అవి నిజమని మేనేజ్మెంట్ ప్రకటించింది. అతడి స్థానంలో జగదీశన్ ను ఆడిస్తోంది.
బుమ్రా పై వర్క్ లోడ్ అధికంగా ఉండడంవల్ల.. చివరి టెస్ట్ ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. వారి స్థానంలో అర్ష్ దీప్ సింగ్, కుల దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్ ను తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది.. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ స్టోక్స్ కూడా లేడు. అతడికి భుజం నొప్పి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు పోప్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆర్చర్, కార్స్ ను కూడా పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించినట్టు ప్రచారం జరుగుతోంది.
N Jagadeesan joins the team for his first training session! #TeamIndia | #ENGvIND pic.twitter.com/xMduwys2E6
— BCCI (@BCCI) July 29, 2025